ధర్మేంద్ర రాజీనామాతోనే ఆగిపోం
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:41 AM
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా తమ నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని, ఇవి ఆరంభమేనని...
కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ, జూలై11(ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా తమ నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని, ఇవి ఆరంభమేనని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కే ప్రకటించారు. వ్యవస్థల్లో ఉన్న లోపాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకొస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. శనివారం జంతర్ మంతర్ వద్ద వందలాది మంది ప్రజలతో దీప్కే మాట్లాడారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాంటూ, పర్యావరణ కార్యకర్త సోమన్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టి 14 రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. తాము అనుకోకుండానే ఈ ఉద్యమాన్ని ప్రారంభించామని, తమవెనుక ఎవరూ లేరని, ఎవరూ నిధులు అందించడం లేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News