Share News

అస్సాంలో సర్ బాధితులను కలుస్తా: అశుతోష్ రంకా

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:50 PM

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కో-కన్వీనర్ అశుతోష్ రంకా అస్సాంలో పర్యటిస్తున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) బాధితులతో మాట్లాడతానని ఆయన తెలిపారు. శనివారం గువహటిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

అస్సాంలో సర్ బాధితులను కలుస్తా: అశుతోష్ రంకా

ఇంటర్‌నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కోకన్వీనర్ అశుతోష్ రంకా అస్సాంలో పర్యటిస్తున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) బాధితులతో మాట్లాడతానని ఆయన తెలిపారు. శనివారం గువహటిలో మీడియాతో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియ కారణంగా అస్సాంలో చాలా మంది ఓటు హక్కును కోల్పోయారని, అలాంటి వారిని కలిసి మాట్లాడతానని చెపక్పారు. అలాగే ఆదివారం స్కూళ్లను కూడా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తానన్నారు. ఇందుకోసం తమ వలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ‘అస్సాంలో మాకు చాలా మంది వలంటీర్లు ఉన్నారు. వారితో కలిసి అస్సాం స్కూళ్లను పరిశీలిస్తా. తర్వాత వలంటీర్లతో భేటీ అవుతా’ అని అశుతోష్ పేర్కొన్నారు.


ఈశాన్య రాష్ట్రాల్లో సీజేపీకి ఆదరణ

అస్సాంతో పాటు మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ తమ పార్టీ సీజేపీకి ఆదరణ పెరుగుతోందని అశుతోష్ అన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో అస్సాం నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అస్సాం ప్రజలు తమ ఆందోళనకు సంఘీభావం తెలిపారని ఆయన వెల్లడించారు. అస్సాం, ఇతర ఈశాన్యా రాష్ట్రాల్లో సీజేపీ చాలా వేగంగా విస్తరిస్తోందన్నారు. తమ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి అస్సాం ప్రజలు తమకు మద్దతు ఇస్తూనే ఉన్నారని వివరించారు. త్వరలో అస్సాంతో పాటు మిగతా ఈశాన్యా రాష్ట్రాల్లోనూ రాష్ట్ర యూనిట్లను ప్రకటిస్తామని అశుతోష్ తెలిపారు. మెరుగైన భారత్‌ కోసం కృషి చేయడం, జవాబుదారీతనం తేవడం, విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర

టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

Read Latest National News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 08:15 PM