యూజీసీ కులవివక్ష, ర్యాగింగ్ నిబంధనలను పునఃసమీక్షిస్తాం
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:22 AM
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష నిర్మూలనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన వివాదాస్పద నిబంధనలను పునఃసమీక్ష చేయడానికి ఓ కమిటీ వేయాలని యోచిస్తున్నామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది
కమిటీ వేయడానికి యోచిస్తున్నాం
సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ, నవంబరు 5: ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష నిర్మూలనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన వివాదాస్పద నిబంధనలను పునఃసమీక్ష చేయడానికి ఓ కమిటీ వేయాలని యోచిస్తున్నామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. విద్యార్థులందరి ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష, ర్యాగింగ్ వంటి వాటిని నిర్మూలించాలని సుప్రీం కోర్టు గట్టిగా చెప్పిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఆ నిబంధనలపై నెలకొన్న ఆందోళనలను ఓ కమిటీ ద్వారా పరిశీలించడానికి కేంద్రం ఆలోచన చేస్తోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనల ధర్మాససం దృష్టికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం తీసుకొచ్చారు. ఉన్న త విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించే లక్షంతో యూజీసీ ఈ ఏడాది జనవరిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధన లు ఏకపక్షంగా ఉన్నాయని, వాటిని తమకు వ్యతిరేకంగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని జనరల్ కేటగిరీ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళ న వ్యక్తం చేశారు. ఆ నిబంధనల అమలు నిలిపివేసేలా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ నిబంధనలు తాము పరిశీలిస్తామని పేర్కొన్న సుప్రీం కోర్టు.. వాటి అమలును అప్పట్లో నిలిపివేసింది. తాజాగా మరోసారి ఆ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. యూజీసీ నిబంధనలను ఎందుకు పునఃసమీక్ష చేయడం లేదని సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరఫున తుషార్ మెహతా బదులిచ్చారు.మరింత సమయం కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ మద్యం వ్యాఖ్యలు.. ‘పప్పు’ అంటూ ఆప్ కౌంటర్
బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500