Share News

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:57 PM

ఇన్ని రోజులూ పూర్తి ఉచితంగా అంబులెన్స్ సేవలందించిన బ్లింకిట్ సంస్థ తమ విధానాలను సవరించింది. ఇకపై ఆ సంస్థ ఎమర్జెన్సీ, నాన్- ఎమర్జెన్సీ కేటగిరీల్లో ఈ సేవలను అందించనుంది.

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ని రోజులూ పూర్తి ఉచితంగా అంబులెన్స్ సేవలందించిన బ్లింకిట్ సంస్థ తమ విధానాలను సవరించింది. ఇకపై ఆ సంస్థ ఎమర్జెన్సీ, నాన్- ఎమర్జెన్సీ కేటగిరీల్లో ఈ సేవలను అందించనుంది. ప్రాణాపాయ స్థితి (Emergency Condition)లో ఉన్న పేషెంట్లకు ఎప్పటిలాగే ఫ్రీ అంబులెన్స్ సదుపాయం కల్పించనుంది. అయితే నాన్- ఎమర్జెన్సీ అవసరాల కోసం అంబులెన్స్ బుక్ చేస్తే మాత్రం రూ.2,500 ఛార్జీ కింద వసూలు చేయనుంది. ఈ విషయాన్ని బ్లింకిట్ మాతృ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ ఈరోజు (గురువారం) ఎక్స్ వేదికగా వెల్లడించారు.


రెండేళ్ల క్రితం ‘పది నిమిషాల్లో అంబులెన్స్’ కాన్సెప్ట్‌తో బింక్లిట్ ఈ రంగంలో ప్రవేశించింది. ఉచితంగా అందులోనూ అత్యంత వేగంగా అంబులెన్స్ సేవలు అందించింది. ఈ క్రమంలో కొందరు నాన్- ఎమర్జెన్సీ అవసరాల కోసం ఈ ఉచిత సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని ఆ సంస్థ గ్రహించింది. రెగ్యులర్ చెకప్స్ కోసం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం కోసం బ్లింకిట్ అంబులెన్స్ బుక్ చేస్తున్నారని గుర్తించింది. అందుకే నాన్- ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 వసూలు చేయాలని నిర్ణయించిది. అయితే ఎమర్జెన్సీ కండిషన్‌లో మాత్రం అంబులెన్స్ సేవలు పూర్తి ఉచితంగానే ఉంటాయని దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్..

వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

Updated Date - Nov 05 , 2026 | 03:58 PM