Share News

విదేశాల్లో ఉంటూ విమర్శలా? రాహుల్‌పై అమిత్‌ షా మండిపాటు

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:06 AM

ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విదేశాల్లో ఉంటూ దేశంలో ఓట్‌ చోరీ జరిగిందని విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. గురువారం ఇక్కడ యమునా నది పునరుజ్జీవన పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా..

విదేశాల్లో ఉంటూ విమర్శలా? రాహుల్‌పై అమిత్‌ షా మండిపాటు

న్యూఢిల్లీ, అక్టోబరు 22: ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విదేశాల్లో ఉంటూ దేశంలో ఓట్‌ చోరీ జరిగిందని విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. గురువారం ఇక్కడ యమునా నది పునరుజ్జీవన పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రసంగించిన ఆయన దేశంలో రాహుల్‌ లేకపోవడాన్ని ప్రశ్నించారు. ‘ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మీరు నా మాటలు వినలేరని తెలుసు. అక్కడికి ఎందుకెళ్లారో కనీసం చెప్పరు. సరే, అది మీ వ్యక్తిగత జీవితం. తిరిగి వచ్చిన తరువాతైనా నా మాటలు గురించి తెలుసుకోండి’ అని వ్యాఖ్యానించారు.

గెలిస్తే అంతా సవ్యంగా జరిగినట్టు, ఓడితే అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు కాంగ్రెస్‌ చెబుతోందని అన్నారు. చొరబాటుదార్లకు ఓటు హక్కు కలిగించాలని కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నకారాత్మక రాజకీయాల కారణంగానే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ దశాబ్దాలుగా గెలవడం లేదని, మరో 30 ఏళ్లయినా ఆ పార్టీ అధికారంలోకి రాదని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:09 AM