దక్షిణాసియా, పశ్చిమ యురేషియాలో కొంకణి ప్రజల మూలాలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:24 AM
భారత పశ్చిమ తీరంలోని కొంకణ్ ప్రాంతంలో నివసించే, కొంకణి భాష మాట్లాడే ప్రజల మాతృవంశ మూలాలు.. ప్రాచీన దక్షిణాసియా, పశ్చిమ యురేషియా ప్రాంతాల్లో ఉన్నాయని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) అధ్యయనంలో గుర్తించింది.
మంచుయుగం చివరిదశలో వలసలతో ఇక్కడికి..
సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): భారత పశ్చిమ తీరంలోని కొంకణ్ ప్రాంతంలో నివసించే, కొంకణి భాష మాట్లాడే ప్రజల మాతృవంశ మూలాలు.. ప్రాచీన దక్షిణాసియా, పశ్చిమ యురేషియా ప్రాంతాల్లో ఉన్నాయని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) అధ్యయనంలో గుర్తించింది. హైదరాబాద్‌లోని సీసీఎంబీతో కలిసి మంగళూరు వర్సిటీ పరిశోధకులు కొంకణి భాష మాట్లాడే వ్యక్తుల జన్యుమూలాలను అన్వేషించారు. ఈ ఫలితాలను హెరిడిటీ జర్నల్‌లో ప్రచురించారు.
మైటోకాండ్రియల్ డీఎన్‌ఏను పరిశీలించి
పశ్చిమతీరంలో దమన్ నుంచి గంగావల్లి నది, కార్వార్ వరకూ విస్తరించిన కొంకణ్ ప్రాంతపు సాంస్కృతిక, జానపద, భాషా వైవిధ్యత ఎంతో ప్రత్యేకం. ఇప్పటివరకు ఈ ప్రాంత ప్రజల జన్యుమూలాలపై పెద్దగా పరిశోధనలు జరగలేదు. సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్, మంగళూరు వర్సిటీ ప్రొఫెసర్ ఎంఎస్ ముస్తాక్ విస్తృత స్థాయిలో అధ్యయనం 295 మంది కొంకణి వ్యక్తుల మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ (తల్లి నుంచి మాత్రమే లభించే డీఎన్‌ఏ)లను యురేషియా ప్రాంతానికి చెందిన ఐదు వేల మందికిపైగా వ్యక్తుల జన్యు సమాచారంతో పోల్చి చూశారు.
ఈ క్రమంలో కొంకణి ప్రజల మాతృవంశ జన్యు సమూహం ప్రాచీన దక్షిణాసియా, పశ్చియ యురేషియా జన్యు వంశాలతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. చివరి మంచు యుగం కాలం నుంచి జరిగిన వలసలతో ఇది జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. ఇతర కొంకణి వర్గాలతో పోలిస్తే గౌడ సారస్వత బ్రాహ్మణులు, రోమన్ క్యాథలిక్కుల్లో జన్యు వైవిధ్యత చాలా ఎక్కువని తేల్చింది. సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్ మాట్లాడుతూ జనాభా వైవిధ్యతకు ప్రసిద్ధిచెందిన దక్షిణాసియాలో ప్రజల ఆవిర్భావ చరిత్రను అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయనం కీలకమైనదన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల