Share News

సీబీఎస్ఈ చైర్మన్‌, సెక్రెటరీపై వేటు

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:56 AM

సీబీఎస్ఈ ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎ స్‌ఎం) మూల్యాంకనం వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు, వ్యవస్థలో భద్రతాపరమైన లోపాల ఆరోపణలపై....

సీబీఎస్ఈ చైర్మన్‌, సెక్రెటరీపై వేటు

పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో

వైఫల్యం నేపథ్యంలో బదిలీ చేసిన కేంద్రం

కొత్త చైర్మన్‌గా లోఖండే ప్రశాంత్‌ నియామకం

ఓఎ్‌సఎం ప్రక్రియ కోసం సంస్థ ఎంపిక, పోర్టల్‌లో లోపాలపై విచారణ కమిటీ

జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌, రీవాల్యుయేషన్‌ పోర్టల్‌ అందుబాటులోకి..

6న అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు గడువు.. ఆధార్‌తో లాగిన్‌.. ఫీజు చెల్లింపు

రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై 2 నిమిషాల్లో.. 15 లక్షల సైబర్‌ దాడుల యత్నం!

ఓఎస్ఎం అవకతవకలపై పార్లమెంటు కమిటీకి 17 ఏళ్ల విద్యార్థి ప్రజెంటేషన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 2: సీబీఎస్ఈ ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎ స్‌ఎం) మూల్యాంకనం వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు, వ్యవస్థలో భద్రతాపరమైన లోపాల ఆరోపణలపై అంతర్గత విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మంగళవారం సీబీఎ్‌సఈ చైర్మన్‌ రాహుల్‌ సింగ్‌, కార్యదర్శి హిమాన్షు గుప్తాలను బదిలీ చేసింది. కేంద్ర హోంశాఖలో అదనపు సెక్రెటరీగా పనిచేస్తున్న సీనియర్‌ అధికారి లోఖండే ప్రశాంత్‌ సీతారామ్‌ను సీబీఎ్‌సఈ కొత్త చైర్మన్‌గా నియమించింది. ఇక ఓఎ్‌సఎం ప్రక్రియ నిర్వహణ కోసం కాంట్రాక్టు సంస్థ ఎంపిక, పోర్టల్‌ లోపాలపై కేంద్రంఎ్‌స.రాధామోహన్‌ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఓఎ్‌సఎం ప్రక్రియ కోసం హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ సంస్థను ఎలా ఎంపిక చేశారు? నిబంధనలన్నీ పక్కాగా పాటించారా, లేదా? అక్రమాలేమైనా జరిగాయా? ఓఎ్‌సఎం పోర్టల్‌లో లోపాలేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందించనుంది. మరోవైపు, విద్యార్థులు రీవ్యాల్యూయేషన్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర విద్యాశాఖ మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లో మంగళవారం ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని సీబీఎ్‌సఈ తెలిపింది. విద్యార్థులు తమ లేదా తమ కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబర్‌ సాయంతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుందని, భద్రత కోసం ఈ నిబంధన పెట్టామని వెల్లడించింది. ఇప్పటికే తమ సమాధాన పత్రాల కాపీలు పొందిన విద్యార్థులకు మాత్రమే పునర్‌ మూల్యాంకనం అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది. విద్యార్థులు ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని.. ఎన్ని సబ్జెక్టులు, పేజీలు, ప్రశ్నల పునర్‌మూల్యాంకనం కోరుతున్నదీ అందులోనే పేర్కొనాల్సి ఉంటుందని తెలిపింది. విద్యార్థులు సమాధాన పత్రాల్లో గుర్తించిన లోపాల పరిశీలన కోసం రూ.100, పునర్‌మూల్యాంకనం కోసం ఒక్కో ప్రశ్నకు రూ.25 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు తర్వాతే దరఖాస్తు సమర్పణ పూర్తయినట్టు అని స్పష్టం చేసింది.


రెండు నిమిషాల్లో.. 15 లక్షల సైబర్‌ దాడులకు యత్నం!

పునర్‌ మూల్యాంకనం కోసం తాజాగా అందుబాటులోకి తెచ్చిన పోర్టల్‌పై తీవ్ర స్థాయిలో సైబర్‌ దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీబీఎస్‌ఈ మంగళవారం వెల్లడించింది. పోర్టల్‌కు సంబంధించిన సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి పెంచి, డౌన్‌ అయ్యేలా ‘డీఓఎస్‌’ దాడులు జరిగాయని తెలిపింది. ప్రస్తుతం పోర్టల్‌కు ఒకే సమయంలో 8 వేల మంది యూజర్లు వినియోగించగలిగే సామర్థ్యం మాత్రమే ఉందని.. కానీ పోర్టల్‌కు రెండు నిమిషాల్లోనే 15లక్షలకు పైగా విజిట్స్‌ వచ్చాయని, సర్వర్‌లోని ఫైల్స్‌ను అనధికారికంగా యాక్సెస్‌ చేసేందుకు లక్షకుపైగా ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపింది. పోర్టల్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా 16వేల మంది విద్యార్థులు రీవ్యాల్యూయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. కాగా, సీబీఎ్‌సఈ డిజిటల్‌ మూల్యాంకన వ్యవస్థలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టుగా ఎథికల్‌ హ్యాకర్లు, సైబర్‌ భద్రతా నిపుణులు గుర్తించి.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.

00000000-national-3-06.jpg

పార్లమెంటు కమిటీకి

17 ఏళ్ల విద్యార్థి ప్రజెంటేషన్‌

సీబీఎ్‌సఈ ఓఎ్‌సఎం టెండర్ల అవకతవకలపై జార్ఖండ్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి సార్థక్‌ సిద్ధాంత్‌ మంగళవారం సంచలన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా సంబంధిత స్థాయీ సంఘం ముందు హాజరైన సార్థక్‌.. తాను గుర్తించిన అంశాలతో 7పేజీల నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఇటీవల సీబీఎ్‌సఈ 12వ తరగతి పరీక్షలు రాసిన ఆయన.. సీబీఎ్‌సఈ బోర్డు తీరును ప్రశ్నిస్తూ పలు అంశాలను పార్లమెంటు కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. విద్యార్థి లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని సీబీఎ్‌సఈ అధికారులను కోరినట్టు తెలసింది. కాగా, ఈ సమావేశానికి హాజరైన సీబీఎ్‌సఈ అధికారులు.. ఓఎ్‌సఎంలో గందరగోళం అంశంపై పలు వివరాలను వెల్లడించారు.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 06:57 AM