Share News

మేకెదాటును అడ్డుకోండి

ABN , Publish Date - May 28 , 2026 | 06:19 AM

కావేరి డెల్టా రైతులకు తీవ్రనష్టం కలిగించేలా కర్నాటక ప్రభుత్వం ఆ నదిపై మేకెదాటు వద్ద చేస్తున్న డ్యామ్‌ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి...

మేకెదాటును అడ్డుకోండి

  • ప్రధాని మోదీకి తమిళ సీఎం విజయ్‌ వినతి

చెన్నై, మే 27 (ఆంధ్రజ్యోతి): కావేరి డెల్టా రైతులకు తీవ్రనష్టం కలిగించేలా కర్నాటక ప్రభుత్వం ఆ నదిపై మేకెదాటు వద్ద చేస్తున్న డ్యామ్‌ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన ప్రధానిని కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. కావేరినదిపై మేకెదాటు వద్ద కొత్త డ్యామ్‌కు భూమిపూజ జరపనున్నట్టు కర్నాటక ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన తమిళ రైతులలో, ప్రత్యేకించి కావేరి డెల్టా రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, కావేరి నిర్వాహక మండలిలో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆమోదం లేకుండా మేకెదాటు ప్రాజెక్టును చేపట్టడానికి వీలులేదని, ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర నీటి వనరులకు శాఖకు ఆదేశాలివ్వాలని మోదీని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని మొదటగా ఆలాపించేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రధాని ఆదేశాలివ్వాలని విజయ్‌ కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 06:19 AM