పెళ్లి కోసం కెనడా నుంచి భారత్‌కు వచ్చింది.. వరుడు ఎందుకు తిరస్కరించాడంటే..
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:23 PM
కెనడాకు చెందిన ఆ మహిళకు ఓ డేటింగ్ యాప్ ద్వారా అతడు పరిచయమయ్యాడు.. ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.. అది కాస్తా ప్రేమగా మారింది.. అతడిని వివాహం చేసుకునేందుకు ఆమె వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు వచ్చి ప్రియుడిని కలిసింది..
ఇంటర్నెట్ డెస్క్: కెనడాకు చెందిన ఆ మహిళకు ఓ డేటింగ్ యాప్ ద్వారా అతడు పరిచయమయ్యాడు.. ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.. అది కాస్తా ప్రేమగా మారింది.. అతడిని వివాహం చేసుకునేందుకు ఆమె వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు వచ్చింది.. అయితే ఆమె వయసు తెలుసుకున్న ప్రియుడు షాకిచ్చాడు.. పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో ఆమె కెనడా రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. రాజస్థాన్‌లోని నీమ్రానాలో ఈ ఘటన జరిగింది (Canadian Woman India).
కెనడాకు చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా హర్యానాలోని పానిపట్‌కు చెందిన నితిన్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ మహిళ కెనడా నుంచి బయల్దేరి నవంబర్ 11న ఢిల్లీ చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకున్న నితిన్ తన బంధువులు ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ రెండ్రోజులు ఉన్నారు. అయితే ఆ మహిళ వయసు 61 అని తెలిసిన తర్వాత నితిన్ మాట మార్చాడు. తన వయసు 30 అని, ఇద్దరి మధ్య వయసు తేడా 30 ఏళ్లు అని, పెళ్లి కుదరదని తేల్చి చెప్పాడు (Dating App Marriage).
నితిన్ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ మహిళ నవంబర్ 13న భారత్‌లోని కెనడా రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది (Canadian Woman 61). కెనడా రాయబార అధికారులు హర్యానాలోని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. నితిన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఆ మహిళను సురక్షితంగా తిరిగి కెనడాకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..