Share News

టీఎంసీ రెబల్స్‌కు షాక్‌.. మమతకు ఊరట

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:55 AM

తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టులో భారీ విజయం లభించింది.

టీఎంసీ రెబల్స్‌కు షాక్‌.. మమతకు ఊరట
mamatha

  • ప్రతిపక్ష నేతగా రితబ్రత నియామకాన్ని రద్దు చేసిన కోర్టు

కోల్‌కతా, నవంబరు 27: తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టులో భారీ విజయం లభించింది. బెంగాల్‌ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న టీఎంసీ రెబల్‌ నేత రితబ్రత బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. పార్టీ చీఫ్‌ విప్‌గా ఉన్న ఎమ్మెల్యే అక్రుజమాన్‌ నియామకాన్ని కూడా పక్కనపెట్టింది. ప్రతిపక్ష నేత నియామకం అంశంలో స్పీకర్‌ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. మమత వాదనలను పునఃపరిశీలించాలని స్పీకర్‌ను ఆదేశించింది. కొత్త ప్రతిపక్ష నేత నియామకంపై పది రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 04:56 AM