భారత్ వ్యూహాత్మక, నైతిక నాయకత్వం వహించాలి.. కేంద్రానికి కాంగ్రెస్ పిలుపు..
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:27 PM
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును వేదికగా చేసుకుని భారత్ వ్యూహాత్మకంగా, నైతికంగా నాయకత్వం వహించే దిశగా సాగాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును వేదికగా చేసుకుని భారత్ వ్యూహాత్మకంగా, నైతికంగా నాయకత్వం వహించే దిశగా సాగాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరింత బలంగా చాటుకోవాలని సూచించింది. గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్ చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యనించారు (Congress on BRICS).
భారతీయ వస్తువులు, సేవల ఎగుమతులకు బ్రిక్స్ మార్కెట్లలో సమాన ప్రాధాన్యత దక్కేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనుసరించిన సమతుల్య విదేశాంగ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం బ్రిక్స్ సదస్సులో మద్దతు సాధించాలన్నారు (India BRICS strategy).
కేవలం ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ న్యాయం, శాంతి, సార్వభౌమత్వం, మానవతా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నైతిక నాయకత్వాన్ని భారత్ ప్రదర్శించాలని కాంగ్రెస్ కోరింది (Congress foreign policy). భారత్ తన సాంప్రదాయ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని కాంగ్రెస్ పేర్కొంది. ఏ ఒక్క శక్తి కూటమికీ పూర్తిగా దగ్గర కాకుండా.. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని దేశాలతో సంబంధాలను కొనసాగించడం ముఖ్యమని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..
భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు.