సూపర్ పీఎం అయ్యేందుకే సోనియా త్యాగం
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:58 AM
సోనియా ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలోని అంశాలపై వివాదం కొనసాగుతూనే ఉంది.
సోనియా ఆత్మకథపై బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ, పాట్నా, నవంబర్ 11: సోనియా ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలోని అంశాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. దేశ ప్రధాని పదవిని తాను తిరస్కరించానని పుస్తకంలో సోనియా పేర్కొనడంపై బీజేపీ బుధవారం కూడా విమర్శలు కురిపించింది. సూపర్ పీఎం అయ్యేందుకే సోనియా పీఎం (ప్రధానమంత్రి) పదవిని త్యాగం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేది విమర్శించారు. ‘‘సోనియా గాంధీ పీఎం పోస్టును విడిచిపెట్టి, యూపీఏ హయాంలో జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్ పదవిని క్యాబినెట్ ర్యాంక్‌తో తీసుకున్నారు. ఈ తరహా త్యాగాన్ని ప్రపంచంలో మరెక్కడా చూసి ఉండరు’’అని త్రివేది ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక, సోనియా తన ఆత్మకథ పుస్తకంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇండియా’ కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు నితీశ్ కుమార్ అవకాశం కోసం ఎదురుచూశారని, ఆయన బీజేపీ ప్రభావంలో ఉన్నారని సోనియా పేర్కొన్నారు. దీనిపై జేడీయూ నేత రాజీవ్ రంజన్ ప్రసాద్ స్పందిస్తూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో నితీశ్ కీలకంగా వ్యవహరించడాన్ని గుర్తు చేశారు
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు