Share News

వందేమాతరం ఆలాపనపై వివాదం.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Aug 16 , 2026 | 03:45 PM

ఆదివారం కర్ణాటకలోని బీజేపీ నేతలు సీనియర్ కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు.

వందేమాతరం ఆలాపనపై వివాదం.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు
Sonia Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో వందేమాతరం ఆలాపనను ఎంపీ సోనియా గాంధీ అడ్డుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కర్ణాటకలోని బీజేపీ నేతలు సీనియర్ నేత సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు. ఉర్వా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు.

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతల తీరు జాతీయ గేయాన్ని అవమానించినట్టుగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. జాతీయ గేయం ఆలాపన సందర్భంగా ఖర్గే, సోనియా గాంధీలు అసౌకర్యంగా ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల తీరు దురదృష్టకరమని బీజేపీ నేత షహనవాజ్ హుస్సేన్ అన్నారు. గేయ ఆలాపనకు అడ్డుపడే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం కావాలనే జాతీయ గేయాన్ని అవమానించిందని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆలాపన సజావుగా సాగుతోందా? లేదా? అనే విషయాన్ని సోనియా గాంధీ చెక్ చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది.

ఈ వార్తలనూ చదవండి:

రాహుల్ గాంధీ ఆస్తుల వివాదం సుప్రీంకోర్టుకు.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సవాల్..

ముంబై నేవీ నగర్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

Updated Date - Aug 16 , 2026 | 04:32 PM