Share News

రాహుల్ గాంధీ ఆస్తుల వివాదం సుప్రీంకోర్టుకు.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సవాల్..

ABN , Publish Date - Aug 16 , 2026 | 02:43 PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.

రాహుల్ గాంధీ ఆస్తుల వివాదం సుప్రీంకోర్టుకు.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సవాల్..
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను పరిశీలించాలంటూ సీబీఐకి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు (Rahul Gandhi assets case).


రాహుల్ గాంధీ ఆదాయ వనరులకు మించి ఆస్తులు కలిగి ఉన్నార బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తనిఖీ ప్రగతిపై తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈడీ కూడా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. జులై 20న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Rahul Gandhi Supreme Court).


రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు (Rahul Gandhi petition). ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఉన్న ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా ఆయన కోరారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఈ పిటిషన్లను ఆగస్టు 17న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించనుంది.


ఇవి కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..

Updated Date - Aug 16 , 2026 | 02:43 PM