ఈసీపై నిరసనకు బీజేడీ మద్దతు.. నవీన్ పట్నాయక్‌కు మమతా బెనర్జీ థ్యాంక్స్..
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:29 PM
న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద విపక్షాల నిరసనకు బిజూ జనతాదళ్ మద్దతు తెలిపింది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేపట్టిన మార్చ్‌లో బీజేడీ ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద విపక్షాల నిరసనకు బిజూ జనతాదళ్ (BJD) మద్దతు తెలిపింది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేపట్టిన మార్చ్‌లో బీజేడీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. బీజేడీ ఇండియా కూటమిలో అధికారికంగా భాగస్వామి కాదు. అయినప్పటికీ ఈ నిరసనకు బీజేడీ మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది (BJD, INDIA bloc).
నిరసనకు బీజేడీ మద్దతు ప్రకటించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. నవీన్ పట్నాయక్‌కు మమత ధన్యవాదాలు తెలిపారు. విపక్ష పార్టీల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. కాగా, బీజేడీ ఎంపీలు మానస్ మంగరాజ్, సులతా దేవ్ విపక్షాల మార్చ్‌లో పాల్గొన్నారు. పార్టీ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకే నిరసనలో పాల్గొన్నట్లు మంగరాజ్ తెలిపారు (Opposition protest).
కాగా, ఇండియా కూటమిలో బీజేడీ చేరలేదని ఆ పార్టీ ఎంపీ సులతా దేవ్ స్పష్టం చేశారు (Voter list row). తమ పార్టీ ఇండియా కూటమితోనూ, ఎన్డీయేతోనూ సమదూరం పాటిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ కోసం మాత్రమే ఈ నిరసనలో పాల్గొంటున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని