మా వాటర్ బాటిళ్లలోని నీళ్లు సురక్షితమే
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:31 AM
తమ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలోని నీళ్లు తాగేందుకు ఏమాత్రం సురక్షితం కాదన్న ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నివేదికను బిస్లెరీ ఇంటర్నేషనల్ కంపెనీ తోసిపుచ్చింది
ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ల్యాబ్ పరీక్షల్లోనే లోపాలు: బిస్లెరీ ఇంటర్నేషనల్
న్యూఢిల్లీ, నవంబరు 23 : తమ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలోని నీళ్లు తాగేందుకు ఏమాత్రం సురక్షితం కాదన్న ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నివేదికను బిస్లెరీ ఇంటర్నేషనల్ కంపెనీ తోసిపుచ్చింది.ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ల్యాబ్‌ల పరీక్షల్లోనే లోపాలు ఉన్నట్టు ఎదురు దాడికి దిగింది. తమ ప్యాకేజ్జ్ వాటర్ బాటిళ్లలోని నీళ్లు తాగేందుకు ముమ్మాటికీ సురక్షితమని ప్రకటించింది. సోమవారం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కి సహకరిస్తామని కంపెనీ ప్రకటించింది. బిస్లెరీ వాటర్ బాటిళ్లలోని నీటిలో బ్రొమేట్, పోలిన్యూక్లియర్ అరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్‌ఎస్) అనే రసాయనాల పరిమాణం, అనుమతించిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్టు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం
కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట