Share News

ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపరాఫర్.. రూ. 1 లక్ష వరకు సంపాదించే ఛాన్స్!

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:55 PM

సోషల్‌ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్ల కు బిహార్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వీడియోలు తీసి వైరల్‌ చేస్తే.. రూ.లక్ష వరకు నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపరాఫర్.. రూ. 1 లక్ష వరకు సంపాదించే ఛాన్స్!
Bihar government social media policy

బిహార్, ఆగస్టు 20: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై మంచి రీచ్, ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్లకు బీహార్ ప్రభుత్వం ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వీడియోలు తీసి వైరల్ చేస్తే దాదాపు లక్ష రూపాయల వరకు నగదు అందుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పాలసీలో చేసిన సవరణకు ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ పాలసీ కింద కంటెంట్ వ్యూస్‌ ఆధారంగా ప్రభుత్వం నగదు చెల్లింపులు చేయనుంది.


కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కంటెంట్ కనీసం 1 లక్ష వ్యూస్ సాధిస్తే రూ. 10,000 వరకు బిహార్ ప్రభుత్వం ఇవ్వనుంది. అదేవిధంగా, అదే విధంగా 10 లక్షల వ్యూస్ సంపాదించే కంటెంట్‌కు గరిష్టంగా రూ. 1 లక్ష వరకు చెల్లించనుంది. అయితే వ్యూస్ పది లక్షలకు పైనా ఎంత చేరినా ఈ నిబంధన కింద గరిష్ట పరిమితి రూ. 1 లక్ష మాత్రమే ఇస్తారు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్న వీడియోలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని బిహార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.


సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్, కంటెంట్ నాణ్యత, వీడియో వ్యూస్‌పై అధికారిక ధ్రువీకరణ చేసిన తర్వాత ఈ చెల్లింపులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కోసం సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయోన్సర్లు సమాచార, ప్రజా సంబంధం విభాగం(ఐపీఆర్డీ)లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీఆర్డీ అనుమతి లేకుండా వీడియోలు చేసిన వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. అంతేకాక సంబంధిత వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలు, ఛానెళ్ల ఫాలోవర్లను నిరంతరం తనిఖీ చేయనున్నట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

‘ప్రక్షాళన’ వివాదంపై మౌనం.. కాంగ్రెస్ నేతల తీరుపై ఖర్గే అసంతృప్తి!

పాకిస్థాన్‌ హైకమిషన్‌ బారికేడ్లు, ట్రాఫిక్‌ బొల్లార్డ్స్‌ తొలగించిన అధికారులు..

Updated Date - Aug 20 , 2026 | 02:07 PM