బిహార్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు..
ABN , Publish Date - Aug 17 , 2026 | 09:16 AM
బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం భారీగా భక్తులు తరలిరావడంతో అశోక్‌ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం భారీగా భక్తులు తరలిరావడంతో అశోక్‌ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. శ్రావణ మాసంలోని సోమవారం నాడు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు (Ashok Dham temple stampede).
ఈ ప్రమాదానికి పూర్తి కారణం ఇంకా వెల్లడి కాలేదు. భక్తులు అకస్మాత్తుగా పోటెత్తడంతో బారికేడ్ కూలిపోయి తొక్కిసలాట జరిగిందని కొందరు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒక విద్యుత్ వైర్ తెగిపడిపోవడంతో విద్యుదాఘాతానికి గురైనట్టు మరికొందరు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు (Bihar temple stampede).
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు (Sawan Monday stampede). ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై కూడా పరిశీలన కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..