Share News

వాట్సాప్‌లో గ్యాస్ మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ!

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:44 PM

దేశ వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్ కు రావాల్సిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

వాట్సాప్‌లో గ్యాస్ మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ!
LPG Scam Fake Gas Messages

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్(LPG gas) సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధిని ఇరాన్(Iran) మూసివేయడంతో భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో సామాన్యులు ఎల్పీజీ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అయితే, వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు కొత్త రకం మోసాలు వెలుగు చూస్తూన్నాయి. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వస్తున్న నకిలీ సందేశాలతో(Fake messages) సైబర్ నేరగాళ్లు సామాన్యుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


స్కామ్ ఎలా జరుగుతుంది?

మొదట మీ సెల్ ఫోన్ కి గ్యాస్ కనెక్షన్ నిలిపి వేయబడుతుంది లేదా మీ సబ్సిడీ ఆగిపోయింది, వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి KYC అప్‌డేట్ చేయండి అంటూ కొన్ని మెసేజ్ లు వస్తుంటే.. ‘తక్షణ LPG సిలిండర్ డెలివరీ’ , ‘బుక్ చేసిన మరుసటి రోజే డేలివరీ సర్వీస్’ అంటూ కొన్ని మేసేజ్‌లు వస్తాయి. ఆ మేసేజ్‌ల్లో ఉండే లింక్స్ క్లిక్ చేస్తే, అవి మీ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ డిటేల్స్ దొంగిలించే నకిలీ వెబ్‌సైట్‌లకు వెళ్లిపోతాయి. మరుసటి రోజు సిలిండర్ డెలివరీ సమయంలో వచ్చే OTPని చెప్పమని ఫోన్ చేస్తారు. మీరు పొరపాటున ఓటీపీ చెబితే మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు సెకన్లలో ఖాళీ అయిపోతాయని సైబర్ పోలీసులు అంటున్నారు. ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


మోసపోకుండా ఉండటానికి చిట్కాలు:

గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. గ్యాస్ బుకింగ్ లేదా సమాచారం కోసం Indane, HP Pay, లేదా BharatGas వంటి అధికారిక మొబైల్ యాప్‌లను లేదా వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించండి. గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి చేరినప్పుడు డెలివరీ బాయ్ అడుగుతాడు, అప్పుడు మాత్రమే OTP చెప్పాలి. సిలిండర్ డెలివరీ బాయ్ యూనీఫామ్‌లో ఉన్నాడా, సరైన గుర్తింపు కార్డు ఉందో లేదో తనిఖీ చేయాలి. గ్యాస్ ఏజెన్సీలు ఎప్పుడూ మీ ఫోన్ కాల్స్ లేదా వాట్సాప్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్ అడగరు. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను నేరుగా సంప్రదించితే మంచిది.


ఇవి కూడా చదవండి

మిథున్ రెడ్డి బెయిల్ రద్దు నిరాకరించిన హైకోర్టు

మీ ముఖం జిడ్డుగా మారుతోందా? వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Updated Date - Mar 13 , 2026 | 09:47 PM