మిథున్ రెడ్డి బెయిల్ రద్దు నిరాకరించిన హైకోర్టు
ABN , Publish Date - Mar 13 , 2026 | 08:32 PM
మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన పరిధి దాటి పలు అంశాలు ప్రస్తావించిందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
అమరావతి, మార్చి 13: మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన పరిధి దాటి పలు అంశాలు ప్రస్తావించిందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అవి కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆ అంశాలను కోర్టు నిలిపివేసింది. మిథున్ రెడ్డి బెయిల్ రద్దును హైకోర్టు నిరాకరించింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది.
అలాగే మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు పూర్తి చేసి.. చార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు గుర్తు చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు ప్రస్తావించిన పలు అంశాల అమలును కోర్టు నిలిపి వేసింది. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ తమ వాదనలు వినిపించారు. శుక్రవారం ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.