Share News

భారీ వర్షం.. ఆస్పత్రి ప్రహారీ గోడ కూలి ఎనిమిది మంది మృతి

ABN , Publish Date - Apr 29 , 2026 | 10:03 PM

బెంగళూరులో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివాజీనగర్ లోని బౌరింగ్ ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారు.

భారీ వర్షం.. ఆస్పత్రి ప్రహారీ గోడ కూలి ఎనిమిది మంది మృతి
Bengaluru rains tragedy

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే శివాజీనగర్ లోని బౌరింగ్ ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలోలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. భారీ వర్షం కురియడంతో బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రి ప్రాంతంలో కొందరు గోడ దగ్గర తలదాచుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోయింది. స్పాట్ లోనే ఎనిమిది మంది చనిపోయారు.


మృతి చెందిన వారంతా వ్యాపారులని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం సిద్దరామయ్య, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదిలా ఉంటే బెంగుళూరుతో పాటు 15 జిల్లాలకు ఎల్ల అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల.. స్పందించిన కేంద్ర మంత్రి

టీడీపీకి గల్లీ పాలిటిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు: మంత్రి లోకేశ్

Updated Date - Apr 29 , 2026 | 10:08 PM