మహిళలకు ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు పే కమిషన్.. బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..
ABN , Publish Date - May 18 , 2026 | 04:55 PM
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలో సోమవారం సీఎం సువేందు అధికారి ఆధ్వర్యంలో రెండోసారి క్యాబినెట్ భేటీ జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలో సోమవారం సీఎం సువేందు అధికారి ఆధ్వర్యంలో రెండోసారి క్యాబినెట్ భేటీ జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి పలు పథకాల అమలు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఐదు కీలక అంశాలపై చర్చ జరిపి, ఆమోదం తెలిపారు (Bengal welfare schemes 2026).
జూన్ 1వ తేదీ నుంచి 'అన్నపూర్ణ' పథకం అమలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది (Annapurna Bhandar scheme). ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు జూన్ 1వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగుల కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక ఆరోగ్య రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురానున్నారు (West Bengal 7th Pay Commission). కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. పీఎం విశ్వకర్మ, పీఎమ్ ఫసల్ బీమా యోజన, పీఎం శ్రీస్కూల్స్ వంటి కేంద్ర పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఒక్కసారిగా రద్దు చేయబోమని సీఎం సువేందు అధికారి ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..