Share News

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. సెన్సెక్స్‌కు స్వల్ప లాభాలు..

ABN , Publish Date - May 18 , 2026 | 04:10 PM

ఉదయం భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయనే వార్తల వల్ల కూడా సూచీలు కోలుకున్నాయి.

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. సెన్సెక్స్‌కు స్వల్ప లాభాలు..
Indian stock market

ఉదయం భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయనే వార్తల వల్ల కూడా సూచీలు కోలుకున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది. (Indian stock market).


గత సెషన్ ముగింపు (75,237)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లు పైకి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 75,315 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 6 పాయింట్ల లాభంతో 23,649 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో కోఫోర్జ్, పెర్సిస్టెంట్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, టెక్ మహీంద్రా, సోలార్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). అంబర్ ఎంటర్‌ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, కోచిన్ షిప్‌యార్డ్, టీవీఎస్ మోటార్స్, యూనో మిండా మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 93 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.35)గా ఉంది.


ఇవి కూడా చదవండి..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..


ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

Updated Date - May 18 , 2026 | 04:13 PM