Share News

బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు చొరవ తీసుకోండి

ABN , Publish Date - May 28 , 2026 | 05:44 AM

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌....

బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు చొరవ తీసుకోండి

  • బీసీ కమిషన్‌ చైర్మన్‌ సాద్వి నిరంజన్‌ జ్యోతికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య వినతి

న్యూఢిల్లీ, మే 27(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ సాద్వి నిరంజన్‌ జ్యోతికి బీజేపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్థికి చర్యలు తీసుకోవాలని సూచించాలని కూడా కోరారు. బీసీ నేతలతో కలిసి ఆర్‌.కృష్ణయ్య బుధవారం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ సాద్వి నిరంజన్‌ జ్యోతితో భేటీ అయ్యారు. పారిశ్రామిక పాలసీలలో, కాంట్రాక్టుల కేటాయింపులో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేేస బీసీ పథకాలకు 60 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని కోరారు. తెలుగురాష్ట్రాలు అమలు చేస్తున్న ఫీజురీయింబర్స్‌మెంట్‌, గురుకుల పాఠశాలలు దేశమంతా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరగా..ఈమేరకు నిరంజన్‌ జ్యోతి హామీ ఇచ్చారని ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:44 AM