హసీనాను అప్పగిస్తేనే బంగ్లాదేశ్ ప్రధాని భారత్ పర్యటన
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:19 PM
మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించే వరకు బంగ్లాదేశ్ నూతన ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారతదేశంలో పర్యటించే ప్రసక్తి లేదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఢాకా, ఆగస్టు 16: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించే వరకు బంగ్లాదేశ్ నూతన ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారతదేశంలో పర్యటించే ప్రసక్తి లేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పర్యటనకు అనుకూలమైన వాతావరణం (Propitious Environment) ఏర్పడాలంటే హసీనా డిపాజిషన్ లేదా అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని బంగ్లాదేశ్ తేల్చిచెప్పింది.
2024లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ విడిచి షేక్ హసీనా భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమెపై తన హయాంలో బంగ్లాదేశ్ లో ప్రజలు, విద్యార్థుల పట్ల అత్యంత అమానషంగా ప్రవర్తించారనే నేరారోపణలు రుజువై మరణశిక్ష పడింది. దీంతో ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత్‌ను కోరుతోంది.
ఇటీవల న్యూఢిల్లీ వేదికగా ఓ మీడియా సమావేశంలో హసీనా పాల్గొని మాట్లాడటంపై ఢాకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌లో ఉంటూ ఆమె చేసే వ్యాఖ్యలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల చర్చలను దెబ్బతీస్తున్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ ప్రతినిధి ఎ.కె.ఎమ్. షాహిదుల్ కరీమ్ వ్యాఖ్యానించారు. తమ దేశ సార్వభౌమాధికారం, పరస్పర గౌరవంతో కూడిన 'బంగ్లాదేశ్ ఫస్ట్' విదేశాంగ విధానాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తారిఖ్ రెహ్మాన్.. సాధారణంగా బంగ్లాదేశ్ నాయకులు తమ తొలి విదేశీ పర్యటనగా భారత్‌ను ఎంచుకునే సాంప్రదాయానికి భిన్నంగా మలేషియా, చైనాలలో పర్యటించారు. మరోవైపు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హసీనా అప్పగింత విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
శుభప్రదం... సౌభాగ్యదాయకం... శ్రావణం
Read Latest AP News And Telangana News And International News And Telugu News