Share News

కోసి నదిలో పడవ మునక.. ఒకరి మృతి, పలువురి గల్లంతు

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:26 PM

బిహార్‌లోని దర్గంబా జిల్లా కోసి నదిలో బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. 13 మందితో ప్రయాణిస్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తక్కిన వారి కోసం స్థానిక అధికారులు, విపత్తు స్పందన సిబ్బంది గాలిస్తున్నారు.

కోసి నదిలో పడవ మునక.. ఒకరి మృతి, పలువురి గల్లంతు
Boat capasizes in Bihar

దర్బంగా: బిహార్‌లోని దర్గంబా జిల్లా కోసి నదిలో బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. 13 మందితో ప్రయాణిస్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తక్కిన వారి కోసం స్థానిక అధికారులు, విపత్తు స్పందన సిబ్బంది గాలిస్తున్నారు.


ప్రాథమిక సమాచారం ప్రకారం, పడవ నదిని దాటుతుండగా ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడటంతో అంతా నీటలో మునిగిపోయారు. ఇంతవరకూ ఒక మృత దేహాన్ని వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. తర్వారా ఘాట్ వద్దనున్న వృత్తాకార గట్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, అందులోని వారంతా పెసర పంట కోతకు రావడంతో నదిని దాటి వెళ్లేందుకు పడవ ఎక్కినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు.


కాగా, గత నెలలో కూడా బిహార్‌లోని సమస్తిపుర్‌ జిల్లాలో పడవ నీట మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయగా, నలుగురి జాడ గల్లంతయింది. ఆ సమయంలో పడవలో 14 మంది ప్రయాణిస్తున్నారు. బలమైన గాలులు కారణంగా పడవ అదుపుతప్పి బోల్తా పడినట్టు ప్రాథమిక సమాచారం. దీనికి ముందు గత ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లోని బార్గి డ్యామ్ రిజర్వాయర్ సమీపంలోని నర్మదా నదిలో పర్యాటకుల పడవ తుపానులో చిక్కుకుని తలికిందులైంది. కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది.


ఇవి కూడా చదవండి..

ప్రధాని పదవిలో చరిత్ర సృష్టించిన మోదీ.. మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్, తీర్మానం

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌ నేతలు..

Updated Date - Jun 10 , 2026 | 03:34 PM