అస్సాం పోలీస్ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్ల దాడి.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:43 PM
అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోని అస్సాం పోలీసు కమాండో క్యాంప్‌పై ఆదివారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జగున్ ఏరియాలో జరిగిన ఈదాడికి తామే బాధ్యులమని నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ ప్రకటించింది.
తిన్సుకియా: అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోని అస్సాం పోలీసు కమాండో క్యాంప్‌పై ఆదివారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జగున్ ఏరియాలో జరిగిన ఈదాడికి తామే బాధ్యులమని నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ (ULFF-I) ప్రకటించింది. తమ సంస్థపై పోలీసులు తరచు దాడులు చేస్తుండటం, గత ఏడాది జూలైలో ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని తమ మొబైల్ క్యాంపుపై ఆర్మీ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతిగా 'ఆపరేషన్ బుజోనీ' పేరుతో ఈ దాడి జరిపినట్టు పేర్కొంది.
అధికారుల సమాచారం ప్రకారం, అస్సాం పోలీసు కమాండో క్యాంపుపై మిలిటెంట్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పీజీ) షెల్స్‌ను పలుసార్లు పేల్చగా, ఐదు షెల్స్ పేలాయి. క్యాంపులోని భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తపై ఎదురుకాల్పులు జరిపాయి. అరుణాచల్ ప్రదేశ్‌తో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు నుంచి తప్పించుకుని వచ్చిన ఏడుగురు సభ్యుల బృందం ఈదాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. మిలిటెంట్ల దాడిలో గాయపడిన నలుగురు సిబ్బందిని డిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. క్షతగాత్రులకు ప్రమాదం తప్పిందని, పరిస్థితి నిలకడగా ఉందని ఏఎంసీహెచ్ సూపరింటెడెంట్ ధ్రువజ్యోతి భయాన్ వివరించారు. అస్సాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఈ దాడి జరగడంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
100కు పైగా సీట్లతో కేరళలో గెలుపు మాదే: కాంగ్రెస్
డీఎంకేకు షాక్.. కూటమి నుంచి వైదొలిగిన తమిళగ వాళ్వూరియా కట్చి