NEET వివాదం.. విద్యార్థుల నిరసనలో మంత్రి కుమార్తె.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:19 PM
అస్సాంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర సీనియర్ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిశా మహంత, కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆమె నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిశా మహంత నీట్ వివాదంపై విద్యార్థుల నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆమె నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గౌహతిలోని చంచల్ ప్రాంతంలో దిబిశా మహంత కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారు. నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా.. నిరసన సందర్భంగా దిబిశా మహంత మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, కేశబ్ మహంత.. అసోం గణ పరిషత్ (ఏజీపీ)లో సీనియర్ నాయకుడు. బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వంలో 2016 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఏజీపీ బీజేపీతో కలిసి అధికార కూటమిలో భాగస్వామిగా ఉండటంతో, అదే కూటమికి చెందిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి కుమార్తె నిరసనలో పాల్గొనడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. విద్యార్థుల డిమాండ్లను గౌరవిస్తున్నామని, నీట్-యూజీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.
Also Read:
జిమ్ ఫొటోలతో సర్‌ప్రైజ్ చేసిన బాలీవుడ్ స్టార్.. 'జో డర్ గయా వో మర్ గయా' అంటూ పోస్ట్..