Share News

ఏప్రిల్‌ మెదటి వారంలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:40 PM

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.

ఏప్రిల్‌ మెదటి వారంలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు
Assam Polls

గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. 126 మంది సభ్యుల అస్సాం అసెంబ్లీ గడువు 2026 మే 20వ తేదీతో ముగియనుంది. ఆ తేదీకి ముందే తాజా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది.


Assam-polls.jpg

అస్సాం ఎన్నికల్లో పోటీ ప్రధానంగా అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అస్సాంలో వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పార్టీ అగ్రనేతల పర్యటనలను ఖరారు చేస్తూ ముందస్తు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది.


బీజేపీ సీఎం అభ్యర్థిగా హిమంత

పార్టీ నుంచి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వా శర్మను మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశాలు బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో హిమంత బిశ్వా శర్మకు ఉన్న పాపులారిటీ, అట్టడుగు స్థాయి వర్గాల్లో ఆయనకు గట్టిపట్టు ఉండటం పార్టీ విజయావకాశాలను మెరుగు పరుస్తుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అస్సాంలో ఎన్నికల ప్రచార ప్లాన్‌ను కూడా బీజేపీ ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తదితర ప్రముఖులు రాష్ట్రవ్యాప్తంగా పలు ర్యాలీల్లో పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి..

కమల్ హాసన్ పార్టీకి టార్చిలైటు గుర్తు

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

Updated Date - Feb 17 , 2026 | 03:53 PM