Share News

మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం..

ABN , Publish Date - Aug 16 , 2026 | 08:51 AM

పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ మృతిచెందారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్‌లో తన ఇంటి పక్కనే ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు.

మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం..
Asish Banerjee

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ మృతిచెందారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్‌లో తన ఇంటి పక్కనే ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు (Asish Banerjee death).


ఆశిష్ బెనర్జీ రాంపూర్‌హాట్‌లోని హట్టాలపారా ప్రాంతంలో నివసించేవారు. ఆయన మృతదేహం పార్టీ కార్యాలయంలో కనిపించడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోస్టుమార్టం తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది (Rampurhat Trinamool Congress).


ఆశిష్ బెనర్జీ రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు (Bengal politics). మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. విద్య, వ్యవసాయం వంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2021లో పశ్చిమ బెంగాల్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రారంభ దశ నుంచే మమతకు ఆశిష్ బెనర్జీ సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశిష్ బెనర్జీ ఓటమిపాలయ్యారు.


ఇవి కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..

Updated Date - Aug 16 , 2026 | 08:51 AM