Share News

భోజ్‌శాలలో హిందువులకు పూర్తి పూజా హక్కులు

ABN , Publish Date - May 21 , 2026 | 04:57 AM

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల ప్రాంగణంలో వాగ్దేవి (సరస్వతీ దేవి)ని పూజించుకునేందుకు...

భోజ్‌శాలలో హిందువులకు పూర్తి పూజా హక్కులు

న్యూఢిల్లీ, మే 20: మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల ప్రాంగణంలో వాగ్దేవి (సరస్వతీ దేవి)ని పూజించుకునేందుకు హిందువులకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ భారత పురావస్తుశాఖ (ఏఎ్‌సఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భోజ్‌శాల ఓ రక్షిత స్మారక కట్టడం మాత్రమే కాకుండా అది ఒక వాగ్దేవి ఆలయమని మధ్యప్రదేశ్‌ హైకోర్టు స్పష్టంచేసిన విషయాన్ని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరమార వంశానికి చెందిన రాజభోజుడి కాలంలో భోజ్‌శాల ఒక ప్రముఖ సంస్కృత విద్యాకేంద్రంగా చారిత్రక ఆధారాల ద్వారా రుజువైందని హైకోర్టు ఈనెల 15న తీర్పునిచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 04:57 AM