రామాలయ విరాళాల చోరీపై చర్యలేవి?: అరవింద్ కేజ్రీవాల్
ABN , Publish Date - Jun 21 , 2026 | 09:16 PM
అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల విరాళాల చోరీపై ఇప్పటివరకు ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు.
న్యూఢిల్లీ, జూన్ 21: అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల విరాళాల చోరీపై ఇప్పటివరకు ఒక్క ఎఫ్‌ఐఆర్(FIR) కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. ఈ కుంభకోణంలో పెద్దల పేర్లు ఉన్నాయని, చర్యలు తీసుకుంటే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉందనే నిందితులను కాపాడుతున్నారని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'X'లో ఓ పోస్ట్ పెట్టారు.
కోట్ల విరాళాలు, వజ్రాలు మాయం!
తన వీడియో సందేశంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'రామాలయంపై కోట్ల మంది హిందువులకు అపారమైన విశ్వాసం ఉంది. అలాంటి పవిత్రమైన ఆలయం నుంచి కోట్ల రూపాయల విరాళాలు దొంగిలించారు. దాదాపు రూ.200 కోట్ల నగదుతోపాటు అనేక వజ్రాల పెట్టెలు, నగలు చోరీకి గురైనట్లు సమాచారం ఉంది. ఇంత జరిగినా యూపీ పోలీసులు గానీ, ఈడీ గానీ, సీబీఐ గానీ కనీసం ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు. కేంద్రంలోనూ, యూపీలోనూ వారి ప్రభుత్వాలే ఉన్నాయి.. కానీ ఎలాంటి దాడులు లేవు, అరెస్టులు లేవు. ఈ పాపానికి ఒడిగట్టిన వారు ఎంతటివారైనా సరే వెంటనే జైల్లో పెట్టాలి' అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..