Share News

అర్జున్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. మరో నటుడిపై కేసు నమోదు

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:07 PM

సోషల్ మీడియాలో తన పెద్ద కుమార్తె ఐశ్వర్యపై నటుడు రంగనాథన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్జున్ పోలీసుకు ఫిర్యాదు చేశారు.

అర్జున్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. మరో నటుడిపై కేసు నమోదు
Aishwarya controversy

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో తన పెద్ద కుమార్తె ఐశ్వర్యపై నటుడు రంగనాథన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని నటుడు అర్జున్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు రంగనాథన్‌తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ మధ్యనే అర్జున్ రెండో కూతురు అంజన వివాహం జరిగిన విషయం విదితమే. అయితే ఈ పెళ్లి వేడుకలకు అంజన సోదరి ఐశ్వర్య రాలేదు. దీంతో వీరి కుటుంబంపై సోషల్ మీడియా చర్చలు మొదలయ్యాయి. కొందరు ఆధారాలు లేని పలు ఆరోపణలను ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథన్ తన కుమార్తె ఐశ్వర్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్జున్ ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఐశ్యర్య వ్యక్తిగత జీవితంపై ఆధారాలు లేని, అనవసర ఆరోపణలు ప్రచారం చేయడం వల్ల తన కూతురి ప్రతిష్ఠకు నష్టం వాటిల్లుతుందని అర్జున్ వాపోయారు. దీంతో పోలీసులు రంగనాథన్‌పైన, మరోవ్యక్తిపైన మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు కచ్చితంగా హాజరుకావాలని ఈ ఇద్దరికి నోటీసులు పంపించారు. ఈరోజే రంగనాథన్ పోలీస్ కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఏడు గంటలకు పైగా విచారణ జరిగినట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్

Updated Date - Nov 24 , 2026 | 10:10 PM