Share News

అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:09 PM

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ ముంబైలోని ఓ పాఠశాలకు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.

అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!
Amitabh Bachchan House Bomb Threat

ముంబై, అక్టోబర్ 23: ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఈమెయిల్ వచ్చినట్లు ఇవాళ (శుక్రవారం) ముంబై పోలీసులకు సమాచారం అందింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలోని ఒక పాఠశాలకు ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ ఘటనపై ముంబై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ బెదిరింపు అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఏ బంగ్లాను (జల్సా లేదా ప్రతీక్ష) లక్ష్యంగా చేసుకుని వచ్చిందనే కోణంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. (Amitabh Bachchan House Bomb Threat)


గతంలో ముంబై మహానగర పాలక సంస్థ కార్యాలయానికి కూడా ఇలాంటి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.

ఈ ఏడాది మార్చి 20వ తేదీన కూడా ముంబై ప్రెస్ క్లబ్‌కు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. భవనం లోపల విషవాయువుతో కూడిన చిన్న చిన్న బాంబులను అమర్చినట్లు ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. అయితే అప్పుడు ప్రెస్ క్లబ్‌లో కూడా ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించలేదు.


ఇవి కూడా చదవండి:

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

వన్డేల్లో జో రూట్ అరుదైన రికార్డు.. ఇంగ్లాండ్ తరఫున తొలి బ్యాటర్ గా..

చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. గిల్ రికార్డు బ్రేక్

Updated Date - Oct 23 , 2026 | 04:09 PM