చర్చకు సిద్ధమే..కానీ స్పీకర్‌కు లేఖ ఇస్తేనే!
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:56 AM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మధ్య బుధవారం మాటల యుద్ధం..
జంతర్‌మంతర్‌లో లాఠీచార్జిపై సమాధానం
చెప్పాలన్న విపక్షాల డిమాండ్‌పై అమిత్ షా
న్యూఢిల్లీ, ఆగస్టు 12: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మధ్య బుధవారం మాటల యుద్ధం జరిగింది. అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు తాను సిద్ధమని, ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయా? సభను భగ్నం చేస్తాయా ? అనేది వారి చేతుల్లోనే ఉందని అమిత్ షా అన్నారు. ఇందుకు స్పందించిన రాహుల్ గాంధీ.. అమిత్ షా కట్టుకథలు, ఉపన్యాసాలు వినేందుకు ప్రతిపక్షం సిద్ధంగా లేదని, విద్యార్థులపై పోలీసు చర్యకు ఆదేశాలు ఎవరిచ్చారనే విషయం యువతరానికి తెలియాలని కౌంటరిచ్చారు. ప్రతిపక్షాల డిమాండ్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు షా సమాధానం ఇచ్చారు. విద్యార్థుల అంశంపై చర్చను కోరుతూ ప్రతిపక్షాలు మధ్యాహ్నం 2గంటల్లోపు స్పీకర్‌కు లేఖ సమర్పిస్తే... బుధవారం మధ్యాహ్నం 3గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3గంటల వరకు తాము చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేసిన షా.. సభ జరగనీయకుండా ప్రతిపక్షం ఎందుకు పారిపోతుందో ప్రజలే తేల్చాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై పోలీసు చర్య జరిగి ఉంటే ఆయన శిక్షార్హుడన్నారు. అలా కాకుండా పోలీసు చర్యకు అమిత్‌షాకు సంబంధం లేదంటే హోం మంత్రిగా షా విఫలమైనట్టేనని తెలిపారు. ఈ రెండింటిలో ఏదైనా సరే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ పేర్కొన్నారు. 20రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న అమిత్ షా.. పోయిన తన పరువును నిలబెట్టుకునేందుకు ఆఖరి నిమిషంలో విద్యార్థుల సమస్యలపై చర్చలకు సిద్ధమంటూ నాటకమాడుతున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News