Share News

నటి అమీషా పటేల్ ఇంట్లో చోరీ కేసు.. పనిమనిషి అరెస్టు..

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:00 PM

యాక్టర్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం కేసులో మహిళా పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో చర్చ్ గేట్ లోని అమీషా ఇంట్లో ఈ ఏడాది జనవరిలో రూ.5 లక్షల విలువైన బంగారు నగలు చోరీకి గురయ్యాయి.

నటి అమీషా పటేల్ ఇంట్లో చోరీ కేసు.. పనిమనిషి అరెస్టు..

ఇంటర్ నెట్ డెస్క్: యాక్టర్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం కేసులో మహిళా పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో చర్చ్ గేట్ లోని అమీషా ఇంట్లో ఈ ఏడాది జనవరిలో రూ.5 లక్షల విలువైన బంగారు నగలు చోరీకి గురయ్యాయి. వాటిలో వజ్రం పొదిగిన బంగారు గాజు కూడా ఉంది. చోరీ తర్వాత అమీషా తల్లి ఆషా పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత నిందితురాలిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జైల్లో ఉందని అమీషా మేనేజర్ తెలిపారు. నిందితురాలిని 40 ఏండ్ల సీమా ఘటేగా గుర్తించారు.


అమీషా ఇంట్లో ఆమె ఎనిమిది నెలల పాటు పనిమనిషిగా చేసింది. దొంగతనం జరిగిన తర్వాత సీమా పని మానేసింది. దీంతో ఆమెను ఆషా అనుమానించారు. చోరీ చేసిన నగలను మర్యాదగా తిరిగి ఇవ్వాలని లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నగలను తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఆషా కంప్లైంట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. విరార్ ప్రాంతంలో సీమాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ముంబై కోర్టులో హాజరుపరుచగా కోర్టు ఈనెల 15 వరకు రిమాండ్ విధించింది. జ్యువెలరీని రికవరీ చేసే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. కాగా.. అమీషా పటేల్ చివరిసారిగా గదార్ మూవీలో సన్నీ డియోల్ తో కలిసి నటించింది. 2023లో ఈ చిత్రం విడుదలైంది.


Also Read:

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అవమానకర గోల్.. వీడియో వైరల్

బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ

Updated Date - Sep 12 , 2026 | 04:02 PM