బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:46 PM
బ్రిక్స్ కూటమి ఏ రకమైన పాశ్చాత్య లేదా ఇతర వర్గానికి వ్యతిరేకంగా పనిచేసే వేదిక కాదని, అందరినీ కలుపుకొనిపోయే భాగస్వామ్య వేదిక అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ బ్రిక్స్ అధ్యక్షత వహించడంలో 'మానవాభివృద్ధే కీలకం' అనే నమూనాను అనుసరిస్తోందన్నారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 12: ఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ (BRICS) సదస్సు ప్రారంభ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. బ్రిక్స్ కూటమి ఏ రకమైన పాశ్చాత్య లేదా ఇతర వర్గానికి వ్యతిరేకంగా పనిచేసే వేదిక కాదని, అందరినీ కలుపుకొనిపోయే భాగస్వామ్య వేదిక అని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ బ్రిక్స్ అధ్యక్షత వహించడంలో 'మానవాభివృద్ధే కీలకం' అనే నమూనాను అనుసరిస్తోందన్నారు.
తద్వారా ఈ కూటమి సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రాధాన్యత అని మోదీ తెలిపారు.
మారుతున్న గ్లోబల్ పరిణామాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), ఇతర ప్రపంచ సంస్థలలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) స్వరాన్ని మరింత బలపరచాలని కోరారు. బ్రిక్స్ ప్రారంభమై రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంలో, కూటమి సాధించిన ఏకాభిప్రాయాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు సాధించే దిశగా తీసుకెళ్లాలని మోదీ సూచించారు.
అన్ని నిర్ణయాలు, కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగేందుకు బ్రిక్స్ లోపల ఒక ప్రత్యేక 'కంటిన్యూటీ అండ్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం' ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు.
ఇవి కూడా చదవండి..
అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..
భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు.