విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్స్‌లో అజిత్ పార్ధివదేహం.. హాజరు కానున్న మోదీ, అమిత్‌షా
ABN , Publish Date - Jan 28 , 2026 | 09:45 PM
అజిత్ పవార్ అంత్యక్రియల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొనే అవకాశం ఉంది. అన్ని పార్టీల నేతలు కడసారి వీడ్కోలు పల్కేందుకు వస్తున్నట్టు ఎన్‌సీపీ నేతలు తెలిపారు
బారామతి: విమాన ప్రమాదంలో మృతిచెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్థివదేహం పుణె జిల్లా బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్స్‌కు చేరుకుంది. తమ ప్రియతమ నాయకుని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు గ్రౌండ్స్‌కు చేరుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం 11 గంటలకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
కాగా, అజిత్ పవార్ అంత్యక్రియల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొనే అవకాశం ఉంది. అన్ని పార్టీల నేతలు కడసారి వీడ్కోలు పలికేందుకు వస్తున్నట్టు ఎన్‌సీపీ నేతలు తెలిపారు. అజిత్ పవార్ సంస్మరణార్థం రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు.. వైరల్ వీడియో
ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన