Share News

8 గంటల పాటు గాల్లోనే..

ABN , Publish Date - May 28 , 2026 | 05:41 AM

ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన...

8 గంటల పాటు గాల్లోనే..

  • చైనా గగనతలం నుంచి ఎయిర్‌ఇండియా విమానం యూటర్న్‌

న్యూఢిల్లీ, మే 27: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన అనంతరం ఆ విమానం తిరిగి ఢిల్లీ చేరుకుంది. విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం వెల్లడించింది. బుధవారం ఢిల్లీ నుంచి బయలుదేరిన బోయింగ్‌ 777-300ఈఆర్‌ రకానికి చెందిన ఏఐ173 విమానం, దాదాపు మూడు గంటల పాటు ప్రయాణించి చైనా గగనతలంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు, విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. 8 గంటల పాటు గాల్లోనే ఉన్న ఈ విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని విమానయాన సంస్థ తెలిపింది. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. వారిని వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:41 AM