Share News

పాకిస్థాన్‌ పైలట్లపై ఎయిర్‌ ఫ్రాన్స్‌ నిషేధం

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:57 AM

‘ఫ్లై దుబాయ్‌’ ఘటన నేపథ్యంలో తమ దేశంలోకి ప్రవేశించే విమానాల్లోని సిబ్బందిపై ఇజ్రాయిల్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఫ్రాన్స్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ ఫ్రాన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్‌ పైలట్లపై ఎయిర్‌ ఫ్రాన్స్‌ నిషేధం
Air France

న్యూఢిల్లీ, అక్టోబరు 14: ‘ఫ్లై దుబాయ్‌’ ఘటన నేపథ్యంలో తమ దేశంలోకి ప్రవేశించే విమానాల్లోని సిబ్బందిపై ఇజ్రాయిల్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఫ్రాన్స్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ ఫ్రాన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయుల్‌కు వెళ్లే విమానాల్లో విధులు నిర్వహించకుండా పాకిస్థాన్‌ సహా, 31ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన సిబ్బందిపై నిషేధం విధించింది.


ఈ జాబితాలో పాకిస్థాన్‌, ఇరాన్‌, ఒమన్‌, సౌదీ అరేబియా, అల్జీరియా, సహా 31 ముస్లిం మెజారిటీ దేశాలు ఉన్నాయి. తాము సేవలందించే దేశాల ప్రవేశ నిబంధనలను ప్రయాణికులు, ఉద్యోగుల విషయంలోనూ పాటించాల్సి ఉంటుందని ఎయిర్‌ ఫ్రాన్స్‌ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

న్యూయార్క్‌ కంటే హైదరాబాద్‌ తక్కువేం కాదు

మొదటి కాన్పులో కవలలు పుట్టినా.. రెండో కాన్పులో ప్రసూతి సెలవులకు అర్హులే

ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 07:32 AM