Share News

23 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి పళనిస్వామి పోటీ

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:57 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.పళనిస్వామి మరోసారి తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి పోటీలో ఉన్నారు.

23 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి పళనిస్వామి పోటీ
K Palaniswami

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అన్నాడీఎంకే (AIADMK) బుధవారంనాడు విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.పళనిస్వామి మరోసారి తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రధాన విపక్షంగా ఉండటంతో పాటు ఎన్డీయే కూటమికి సారథ్యం వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిగా అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీ కూడా అన్నాడీఎంకేనే కావడం విశేషం.


ఇతర ప్రముఖుల్లో..

పార్టీ అభ్యర్థులుగా అన్నాడీఎంకే ప్రకటించిన ప్రముఖుల్లో వెప్పనహళ్లి నుంచి కెపీ మునుస్వామి, దిండిగల్ నుంచి దిండిగల్ సి శ్రీనివాసన్, నాథమ్ నుంచి నాథమ్ ఆర్ విశ్వనాధన్, తొండముత్తూరు నుంచి ఎస్‌పీ వేలుమణి, రాయపురం నుంచి డి.జయకుమార్ పోటీలో ఉన్నారు. తొలి జాబితాలో పలువురు సీనియర్ పేర్లు చోటుచేసుకున్నాయి. కృష్ణగిరి నుంచి పి.బాలకృష్ణన్, రాయకొట్టయ్ నుంచి డి.జయకుమార్, హోసూరు నుంచి సీవీ షణ్ముగం, ముదురాంతకం నుంచి ఎస్‌కే రేజేంద్రన్, పలాకోడ్ నుంచి కేపీ అన్బళగన్, పెన్నాగరమ్ నుంచి ఆర్‌కే నాగరాజ్, వేలూరు నుంచి ఓఎస్ మణియన్ పోటీ చేస్తున్నారు. ఎన్డీయే సీట్ల కేటాయింపులో భాగంగా 170కి పైగా స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుండగా, కూటమి భాగస్వామి బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 23న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. తమిళనాడు ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి మే 10వ తేదీతో ముగియనుంది.


ఇవి కూడా చదవండి...

పశ్చిమాసియా సంక్షోభం.. రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. 24 గంటల్లో ఇది రెండోసారి

Updated Date - Mar 25 , 2026 | 04:01 PM