Share News

అమెరికాలో అదానీపై కేసు కొట్టివేతపై అనుమానాలున్నాయి: రాహుల్‌

ABN , Publish Date - Aug 13 , 2026 | 06:23 AM

అదానీపై ఉన్న క్రిమినల్‌ అభియోగాలను అమెరికా ఫెడరల్‌ కోర్టు శాశ్వతంగా కొట్టివేయడంపై రాహుల్‌ గాంధీ స్పందించారు...

అమెరికాలో అదానీపై కేసు కొట్టివేతపై అనుమానాలున్నాయి: రాహుల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 12: అదానీపై ఉన్న క్రిమినల్‌ అభియోగాలను అమెరికా ఫెడరల్‌ కోర్టు శాశ్వతంగా కొట్టివేయడంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇందులో తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రాజీపడిన ప్రధాని భారత ప్రయోజనాలను ఫణంగా పెట్టారని రాహుల్‌ ఆరోపించారు. ఈ కారణంగా భారత్‌ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పోస్టులో రాశారు. 2024లో సౌరవిద్యుత్‌ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి భారత పాలనాధికారులకు రూ.2500 కోట్లు చెల్లించారని అదానీపై అభియోగాలు నమోదయ్యాయి. సౌర పథకాల్లో పెట్టుబడులు అని చెబుతూ రూ.38వేల కోట్ల నిధులను అమెరికా పెట్టుబడిదారుల నుంచి సేకరించి లంచాలు ఇచ్చారని, సాక్ష్యాలను ధ్వంసం చేసి ఎఫ్‌బీఐ, ఫెడరల్‌ గ్రాండ్‌ జ్యూరీకి అబద్ధాలు చెప్పారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలను కొట్టివేయాలన్న అమెరికా న్యాయశాఖ అభ్యర్థనను ఫెడరల్‌ కోర్టు ఆమోదించింది.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 06:23 AM