ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అభిజీత్ దీప్కే.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:58 AM
అమెరికా నుంచి భారత్‌కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేరుకున్నారు. ఈరోజు (శనివారం) ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం ఉదయం దీప్కే దిగారు.
న్యూఢిల్లీ: అమెరికా నుంచి భారత్‌కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేరుకున్నారు. ఈరోజు (శనివారం) ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం ఉదయం దీప్కే దిగారు. తెల్లటి టీ-షర్ట్, నల్లటి హుడీ, నల్లటి టోపీ ధరించి ఎయిర్‌పోర్టులో మాట్లాడుతున్న అభిజీత్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిజీత్ వీడియోలను మద్దతుదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
అభిజీత్ ఎక్స్ పోస్టు..
విమానం దిగిన వెంటనే ఎక్స్ వేదికగా అభిజీత్ పోస్టు పెట్టారు. నిరసన ప్రదర్శన సందర్భంగా శాంతిని పాటించాలని సీజేపీ మద్దతుదారులను ఆయన కోరారు. 'భారత్‌కు వచ్చా. జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఎదురుచూస్తున్నా. ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని, త్రివర్ణ పతాకాన్ని తీసుకురావడం మర్చిపోకండి. కరుణ, కృతజ్ఞతకు చిహ్నంగా పోలీసులకు పువ్వులు సమర్పించండి. మనం ఈ ఉద్యమాన్ని ప్రేమ, శాంతితో నడిపించాలి' అంటూ పోస్టు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత..
సీజేపీ నిరసన సందర్భంగా రాజధాని ఢిల్లీ అంతటా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా న్యూఢిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 1,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రైల్వేస్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, ఢిల్లీ సరిహద్దు ప్రవేశ మార్గాల వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు.
కాగా, నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవతకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై సీజేపీ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నిరసనకు పిలుపునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
3.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్-ఫిలిప్పీన్స్ వాణిజ్యం
బాంబు పేలుడు కేసు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు..