తమిళనాడులో సంచలనం.. భార్యతో విడాకులు తీసుకుంటున్న మంత్రి..
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:32 PM
తమిళనాడు రాజకీయాల్లో మంత్రి ఆదవ్ అర్జున వ్యక్తిగత జీవితం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆదవ్ అర్జున, ఆయన భార్య డైసీ మార్టిన్ తమ 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.
చెన్నై, నవంబర్ 16: తమిళనాడు రాజకీయాల్లో మంత్రి ఆదవ్ అర్జున వ్యక్తిగత జీవితం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆదవ్ అర్జున, ఆయన భార్య డైసీ మార్టిన్ తమ 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇవాళ (సోమవారం) డైసీ మార్టిన్ సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తమ వైవాహిక జీవితాన్ని ముగించి, వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని తామిద్దరం పరస్పరం నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు.
డైసీ మార్టిన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
'14 సంవత్సరాలుగా ఒకరి జీవితంలో మరొకరం భాగమై స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా వివిధ దశల్లో ప్రయాణించాం. ఇది ప్రేమ, అవగాహన, మార్పులతో నిండిన ప్రయాణం. ఈరోజు నేను, ఆదవ్ అర్జున దంపతులుగా విడిపోయి, వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని పరస్పరం నిర్ణయించుకున్నాం. మా బిడ్డను పెంచే బాధ్యతకు ఇద్దరం కట్టుబడి ఉన్నాం. ఇది మా ఇద్దరికీ ఒక కొత్త అధ్యాయం. ఆదవ్‌ను ఇప్పటికీ ఎంతో గౌరవిస్తాను. ఆయన భవిష్యత్ ప్రయత్నాల్లో సంతోషం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
కాగా, తమిళనాడు రాజకీయాల్లో ఆదవ్ అర్జున కీలక నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ప్రజా పనులు, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డైసీ మార్టిన్ ప్రకటనతో వీరిద్దరి వ్యక్తిగత జీవితం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
మరో వివాదంలో జెన్సన్ హువాంగ్.. అంతర్గత విచారణ చేపట్టిన ఎన్విడియా..!
బ్రేకప్ చెప్పిందని ఇంతటి ఘాతుకమా?.. మాజీ ప్రియురాలి కుక్కలను చంపి వీడియో కాల్..