జీతం 400 శాతం పెంచండి
ABN , Publish Date - May 28 , 2026 | 06:02 AM
కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులకు సంబంధించి ఉద్యోగ సంఘాలు 8వ వేతన సవరణ సంఘం ముందు ఉంచుతున్న ప్రతిపాదనలు...
ఎనిమిదో వేతన సవరణ సంఘానికి ఐఆర్‌టీఎస్ఏ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, మే 27 : కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులకు సంబంధించి ఉద్యోగ సంఘాలు 8వ వేతన సవరణ సంఘం ముందు ఉంచుతున్న ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కొందరు సీనియర్ ఉద్యోగుల వేతనాన్ని 400 శాతం పెంచాలంటూ ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్(ఐఆర్‌టీఎ్‌సఏ) చేసిన ప్రతిపాదన తవ్ర చర్చకు దారి తీసింది. అలాగే, ఉద్యోగులందరికీ ఒకేవిధమైన ఫిట్‌మెంట్ కాకుండా ఉద్యోగుల స్థాయి, వేతన స్కేలు ఆధారంగా ఐదు విభాగాలుగా ఫిట్‌మెంట్(గరిష్టంగా 4.38) నిర్ణయించాలని ఐఆర్‌టీఎ్‌సఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన కింద ఉద్యోగులను వారి వేతన స్కేలు ప్రకారం 5విభాగాలుగా విభజించారు. ఈ ప్రతిపాదన అమలైతే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి. రూ.45వేలు వేతనం కలిగిన ఉద్యోగుల జీతం రూ.1.57లక్షలకు పెరుగుతుంది. కాగా, ఏడో వేతన సవరణ సంఘం ఫిట్‌మెంట్‌ను అందరికీ ఒకేలా 2.57గా ఉంచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News