ఒకే రోజు 555 కేసుల విచారణ
ABN , Publish Date - Sep 04 , 2026 | 03:37 AM
కర్ణాటక హైకోర్టు మరో రికార్డు సాధించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న బుధవారం ఒకేరోజు 555 కేసులను విచారించారు.
రికార్డు సృష్టించిన జస్టిస్ నాగప్రసన్న
కర్ణాటక హైకోర్టులో ఇదో మైలురాయి
బెంగళూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కర్ణాటక హైకోర్టు మరో రికార్డు సాధించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న బుధవారం ఒకేరోజు 555 కేసులను విచారించారు. అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన 250 పిటిషన్‌లను కేవలం రెండున్నర గంటలలో విచారించారు. కోర్టు కార్యకలాపాలు మొదలుకాగానే ఉదయం 240కి పైగా మెమోలను స్వీకరించి, మధ్యాహ్నం జాబితాలో చేర్చాలని ఆదేశించారు. బెంచిమీదకు ఉదయం వచ్చిన 318 పిటిషన్‌లను విచారించారు. మధ్యాహ్న భోజనం తర్వాత 2.30 గంటలకు బెంచ్‌కు వచ్చిన న్యాయమూర్తి, రాత్రి 8.05గంటల దాకా విచారణలు కొనసాగించారు. ఇలా ఒకే రోజున 555 రిట్ పిటీషన్‌లు, క్రిమినల్ పిటిషన్‌ల విచారణ పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి