-
-
Home » Mukhyaamshalu » Ap Telangana National International Latest Breaking and trending ABN Andhrajyothy news Live Updates of 21th March 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 21 , 2026 | 07:20 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 21, 2026 08:41 IST
ఇరాన్‌పై మా లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాం: ట్రంప్
సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నాం
ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను ధ్వంసం చేశాం
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే తగినవిధంగా స్పందిస్తాం
పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు రక్షణ కల్పిస్తున్నాం
-
Mar 21, 2026 08:39 IST
కర్నూలు: పత్తికొండ చాకలి వీధిలో కోడి పెట్టిన చిచ్చు
కోడి మృతి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
పోలీసు స్టేషన్‌కు చేరిన వివాదం
-
Mar 21, 2026 07:55 IST
తిరుమల: భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన చంద్రబాబు
భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన సీఎం చంద్రబాబు
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఎస్వీ అన్నదాన ట్రస్ట్‌కు విరాళం
రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబ సభ్యులు
మనవడు దేవాన్ష్ పుట్టినరోజుకు ఏటా విరాళం అందజేయడం ఆనవాయితీ
-
Mar 21, 2026 07:37 IST
హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు
ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక పార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్న ముస్లిం సోదరులు
మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న ముస్లిం సోదరులు
మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సామూహిక ప్రార్థనలు
మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు
లా అండ్ ఆర్డర్, క్విక్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు
రద్దీ నేపథ్యంలో మీరాలం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
Mar 21, 2026 07:25 IST
విజయనగరం: ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
రామభద్రపురం మం. తారాపురం దగ్గర బస్సులో చెలరేగిన మంటలు
బస్సు వెనుక టైర్ పేలి చెలరేగిన మంటలు
టైర్ పేలడంతో బస్సు నుంచి ప్రయాణికులను దించేసిన డ్రైవర్
మంటల ధాటికి పూర్తిగా దగ్ధమైన బస్సు, తప్పిన ప్రాణనష్టం
భువనేశ్వర్ నుంచి మల్కాజిగిరికి వెళ్తున్న ఒడిశా ట్రావెల్స్ బస్సు
-
Mar 21, 2026 07:24 IST
అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి కన్నుమూత
గుండె సమస్యకు చికిత్స పొందుతూ హనుమంతరాయచౌదరి మృతి
-
Mar 21, 2026 07:24 IST
తెలంగాణలో పాఠశాలలు, తరగతుల కోసం నిధులు
PP-2 నుంచి ఇంటర్ వరకు 11 కొత్త స్కూళ్లు ఏర్పాటు
ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయిన మరో 17 స్కూళ్లు
164 పాఠశాలల్లో 501 తరగతి గదుల నిర్మాణం
రూ.1,011 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
Mar 21, 2026 07:23 IST
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం
23న సాయంత్రం 5 గంటలకు సమావేశం
-
Mar 21, 2026 07:23 IST
రేపు సిద్దిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్
రూ.300 కోట్లతో 365 ఎకరాల విస్తీర్ణంలో రిఫైనరీ
-
Mar 21, 2026 07:23 IST
విశాఖలో త్వరలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ
రూ.2,387 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ASIP సంస్థ
30 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
-
Mar 21, 2026 07:22 IST
ద్రోణి ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు
పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు
-
Mar 21, 2026 07:22 IST
బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు మరింత ఆర్థిక భారం
అన్ని కేటగిరీ వీసాలపై ఫీజులు పెంచిన బ్రిటన్
ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి UK వీసా ఫీజుల పెంపు
-
Mar 21, 2026 07:22 IST
పశ్చిమాసియాలో 22వ రోజుకు చేరిన యుద్ధం
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఆగని ఇరాన్ దాడులు
కువైట్‌లోని కీలక రిఫైనరీలో మంటలు
పర్యాటక ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామన్న ఇరాన్
-
Mar 21, 2026 07:21 IST
ఏపీలో నేడు జరగాల్సిన టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా
నేడు రంజాన్ సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఏప్రిల్ 2న జరగనున్న పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష
-
Mar 21, 2026 07:21 IST
నేడు ఈద్-ఉల్-ఫితర్
నేడు రంజాన్ జరుపుకోనున్న ముస్లింలు
భారత్‌లో నిన్న కనిపించిన నెలవంక
-
Mar 21, 2026 07:20 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
మనవడు దేవాన్ష్ బర్త్‌డే సందర్భంగా..
స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబసభ్యులు