-
-
Home » Mukhyaamshalu » Andhrapradesh Telangana National International news ABN Andhrajyothy Live Updates of 7th March 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 07 , 2026 | 07:40 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 07, 2026 10:23 IST
ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి టికెట్లు
భద్రాద్రిలో మార్చి 27న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
ఆన్‌లైన్‌లో అందుబాటులో టికెట్లు
దేవస్థానం వెబ్‌సైట్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా టికెట్ల అమ్మకం
-
Mar 07, 2026 10:17 IST
విజయవాడలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
16 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
కౌశిక్ రెడ్డి, దండు అచ్యుత్, సాయిహేమంత్, అద్దేపల్లి సాయివివేక్ అరెస్ట్
నలుగురు నిందితులను మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
-
Mar 07, 2026 10:07 IST
ఇరాన్ డ్రోన్ క్యారియర్ షిప్‌ను ధ్వంసం చేసిన అమెరికా
చిన్న విమాన వాహక నౌక సైజులో డ్రోన్ క్యారియర్
వీడియో విడుదల చేసిన అమెరికా సెంట్రల్ కమాండ్
-
Mar 07, 2026 10:06 IST
యుద్ధ ప్రభావంతో కొనసాగుతున్న విమానాల రద్దు
శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళాల్సిన 12 విమానాలు నిలిపివేత
గల్ఫ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన 12 విమానాలు రద్దు
ఖతార్, UAE, కువైట్ నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు రద్దు
బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి పలు విమానాలు నిలిపివేత
-
Mar 07, 2026 08:45 IST
తిరుమలలో కేక్ కటింగ్‌పై దువ్వాడ శ్రీనివాస్, మాధురి వివరణ
ఎగ్ లెస్ కేక్ కట్ చేసినట్లు తెలిపిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి
కేక్ కట్ చెయ్యకూడదన్న నిబంధన ఉన్నట్లు తెలియదన్న ఇరువురు
తనూజకు ఈ వివాదంతో ఎటువంటి సంబంధం లేదు: మాధురి
కేసులు పెడితే మా పై పెట్టండి..మేము ఎదుర్కొంటాం: మాధురి
-
Mar 07, 2026 08:41 IST
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు
గృహ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌పై రూ.115 పెరుగుదల
అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు.. హైదరాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ రూ.965
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెరిగిన ధరలు
ఉజ్వల పథకం సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు
-
Mar 07, 2026 08:21 IST
ఇంటర్మీడియట్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హోంగార్డ్
రక్షణ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన హోంగార్డు
ఇప్పటికే పైళ్లై భార్య, పిల్లలు ఉండగా మరో యువతితో పెళ్లి
మేడారం జాతరలో యువతితో పరిచయం
మాటలు కలిపి 20 రోజుల్లోనే యువతిని పెళ్లి చేసుకున్న హోంగార్డు
-
Mar 07, 2026 08:04 IST
కొచ్చి ఓడరేవులో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం
అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో పాల్గొన్న ఇరాన్ యుద్ధ నౌక
ఈనెల 4న కొచ్చి ఓడరేవుకు వచ్చిన ఇరాన్‌కు చెందిన IRIS లావన్
183 మంది సిబ్బందికి కొచ్చి నావల్ బేస్‌లో ఆశ్రయం ఇచ్చిన ప్రభుత్వం
-
Mar 07, 2026 07:40 IST
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
గల్ఫ్ దేశాలపై దాడులు ముమ్మరం చేసిన ఇరాన్
కువైట్, ఖతార్, సౌదీలపై ఇరాన్ డ్రోన్ దాడులు