-
-
Home » Mukhyaamshalu » Andhrapradesh Telangana National International Latest and Breaking news ABN Andhrajyothy Live Updates of 14th March 2026 siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 14 , 2026 | 06:53 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 14, 2026 09:18 IST
నేడు పాడేరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
జనసేన జెండాను ఆవిష్కరించనున్న పవన్ కల్యాణ్
నందిగరువు గ్రామంలో గిరిజనులతో పవన్ మాటామంతీ
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్
-
Mar 14, 2026 09:15 IST
ఇరాన్ ఆర్థిక కిరీటం ఖర్గ్ ఐలాండ్‌పై విరుచుకుపడిన అమెరికా సైన్యం
ఐలాండ్‌లోని సైనిక లక్ష్యాలను తునాతునకలు చేశామని ప్రకటించిన ట్రంప్
హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలను రవాణాను అడ్డుకుంటే మరింత తీవ్ర దాడులు
యూఎస్ బలగాల దాడి వీడియోను షేర్ చేసిన ట్రంప్
ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఖర్గ్ ఐలాండ్ నుంచే సరఫరా
-
Mar 14, 2026 08:42 IST
బాపట్ల: పర్చూరు మండలం దేవరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
గొర్రెల మందను ఢీకొట్టి కారు బోల్తా
43 గొర్రెలు మృతి
కారును వదిలేసి డ్రైవర్ సహా అందరు పరారీ
-
Mar 14, 2026 08:31 IST
కేసీఆర్ హయాంలో మూసీ అభివృద్ధిపై నేడు బీఆర్ఎస్ ప్రెజెంటేషన్
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పాల్గొననున్న కేటీఆర్
-
Mar 14, 2026 08:30 IST
కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి: కేంద్రమంత్రి బండి సంజయ్
తుంగతుర్తి ఎమ్మెల్యే మళ్లీ ఎలా గెలుస్తారో చూస్తాం
హిందూధర్మాన్ని కించపరిచేలా తుంగతుర్తి ఎమ్మెల్యే మాట్లాడారు
మత విద్వేషాలు రగిల్చేలా తుంగతుర్తి ఎమ్మెల్యే మాట్లాడారు
-
Mar 14, 2026 08:29 IST
కరీంనగర్: కొండగట్టు అభివృద్ధి బాధ్యత మేం తీసుకుంటాం: బండి సంజయ్
పవన్ కొండగట్టుకు టీటీడీ నుంచి నిధులు కేటాయించారు
BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదు
కొండగట్టు పాదయాత్రకు రాజకీయాలతో సంబంధం లేదు
-
Mar 14, 2026 08:28 IST
ఇరాన్ భూభాగంపై దాడులకు సిద్ధమైన అమెరికా
ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహం
మిడిల్ ఈస్ట్‌కు అమెరికా మెరైన్ కమెండోలు
సముద్రమార్గంలో మెరైన్ దళాల తరలింపు
-
Mar 14, 2026 08:27 IST
కృష్ణా: గూడూరు పీఎస్ దగ్గర పేర్ని నాని హంగామా
పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని
2 రోజులుగా మచిలీపట్నంలో జనసేన జెండా దిమ్మ వివాదం
వైసీపీ నాయకుడు బొర్రా విఠల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
విఠల్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినా పీఎస్ దగ్గర పేర్నినాని హంగామా
-
Mar 14, 2026 07:55 IST
నేటి నుంచి ఇండిగో విమాన టికెట్ ధరలు పెంపు
విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జ్ పెంచిన ఇండిగో
కనిష్ఠంగా రూ.425, గరిష్ఠంగా రూ.2,300 పెంచిన ఇండిగో
-
Mar 14, 2026 07:54 IST
తెలంగాణలో వాయుకాలుష్యం తగ్గించేలా ప్రణాళికలు
1.26 లక్షల ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో నడుస్తున్న ఆటోలకు...
ఎలక్ట్రిక్ కిట్లు అమర్చే ప్రత్యేక పాలసీపై కసరత్తు
-
Mar 14, 2026 07:10 IST
14వ రోజుకు చేరిన ఇరాన్ యుద్ధం
టెహ్రాన్ నుంచి టెల్‌అవీవ్ వరకు విధ్వంసకర గుర్తులు
ఇరాన్, లెబనాన్‌లో అనేక లక్ష్యాలు ఛేదించిన ఇజ్రాయెల్ దళాలు
హోర్ముజ్‌తో పాటు ఇతర స్థావరాలకు అదనపు బలగాలను దించిన అమెరికా
జపాన్ నుంచి నౌకలు, 2,500 మంది కమాండోలు వెళ్లాలని అమెరికా ఆదేశం
మొజ్తాబా ఖమేనీ, లారిజానీ అచూకీ చెబితే రూ.93 కోట్లు ఇస్తామన్న అమెరికా
-
Mar 14, 2026 07:09 IST
నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం
ఏపీవ్యాప్తంగా జనసేన శ్రేణుల వేడుకలు
-
Mar 14, 2026 07:04 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ఇవాళ బంగారం, వెండి ధరలు వివరాలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,290
హైదరాబాద్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.2.89 లక్షలుగా ఉంది
-
Mar 14, 2026 06:59 IST
హైదరాబాద్: టోలీచౌకిలో అగ్నిప్రమాదం
సెవెన్ టూంబ్స్ సబ్‌స్టేషన్ పక్కన చెలరేగిన మంటలు
ప్రమాద సమయంలో సమీప మసీద్‌లో 2 వేల మంది
మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
మహిళలు, చిన్నారులను సురక్షితంగా పంపిన మసీద్ కమిటీ
-
Mar 14, 2026 06:53 IST
తెలంగాణలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం
ఏప్రిల్ 16వ తేదీతో పూర్తికానున్న టెన్త్ పరీక్షలు