Share News

Breaking News: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - Jan 09 , 2026 | 06:02 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

Live News & Update

  • Jan 09, 2026 20:24 IST

    ఢిల్లీ: జనవరి 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    • ఏప్రిల్ 2 వరకూ రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహణ

    • బడ్జెట్ సమావేశాలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

    • జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు

    • మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకూ రెండో విడత సమావేశాలు

    • ఎక్స్ వేదికగా ధ్రువీకరించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు

  • Jan 09, 2026 19:43 IST

    ఢిల్లీ: ఈ ఏడాది రిటైర్‌ అవుతున్న రాజ్యసభ సభ్యుల జాబితా విడుదల

    • ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైర్‌ కానున్న ఇద్దరు తెలంగాణ సభ్యులు

    • ఏప్రిల్‌ 9న BRS సభ్యుడు కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ సభ్యుడు అభిషేక్‌మను సింఘ్వి రిటైర్‌

    • ఈ ఏడాది జూన్‌లో రిటైర్‌ కానున్న నలుగురు ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు

    • రిటైర్‌ కానున్న వైసీపీ ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ,...

    • పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, తెదేపా సభ్యుడు సానా సతీష్‌

    • అన్ని రాష్ట్రాలు, నామినేటెడ్‌ సభ్యుల రిటైర్‌మెంట్‌ బులిటెన్‌ విడుదల

  • Jan 09, 2026 19:42 IST

    అమరావతి: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

    • tet2dsc.apcfss.in వెబ్ సైట్‌లో టెట్‌ ఫలితాలు: లోకేష్‌ ట్వీట్‌

    • వాట్సాప్ గవర్నెన్స్ నెం: 95523 00009 ద్వారా ఫలితాలు

    • గతేడాది డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు జరిగిన టెట్

    • పరీక్షలు రాసిన 2,48,427 మంది అభ్యర్థులు

    • టెట్‌లో 47.82 శాతం మంది అభ్యర్థుల ఉత్తీర్ణత

  • Jan 09, 2026 18:05 IST

    హిమాచల్‌ప్రదేశ్‌: లోయలో ట్రావెల్స్‌ బస్సు బోల్తా

    • ఎనిమిది మంది మృతి, 50 మందికిపైగా గాయాలు

    • ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

    • సిమ్లా నుంచి కుప్వి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు

    • సిర్మౌర్‌ జిల్లా హరిపుర్దార్‌లో ఘటన

  • Jan 09, 2026 18:05 IST

    అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని భారత్‌ సంకేతాలు

    • 500% టారిఫ్‌ ప్రతిపాదనలు ముందే తెలుసన్న కేంద్రం

    • 140 కోట్ల మంది ఇంధన అసరాలు ముఖ్యమన్న భారత్‌

    • చౌక ధరకు దొరికే చోటే ఇంధనం కొనుగోలు చేస్తామని MEA ప్రకటన

    • పరిణామాలు, పర్యవసానాలు కూడా అధ్యయనం చేస్తున్న MEA

  • Jan 09, 2026 18:05 IST

    ఢిల్లీ: అమెరికా ఆంక్షల బిల్లుపై స్పందించిన భారత ప్రభుత్వం

    బిల్లు గురించి తమకు అవగాహన ఉందన్న కేంద్ర విదేశాంగ శాఖ

    ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ప్రకటన

    రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై...

    అదనపు ఆంక్షలు విధించేలా కొత్త బిల్లు సిద్ధం చేసిన అమెరికా

  • Jan 09, 2026 18:05 IST

    కృష్ణా: మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణాకు అడ్డుకట్ట

    • అక్రమార్కుల చెర నుంచి ముగ్గురు బాలలకు విముక్తి

    • ముగ్గురు నిందితులు అరెస్ట్, మరొకరి కోసం గాలింపు చర్యలు

    • సంచార జాతుల పిల్లలే టార్గెట్‌గా అక్రమ రవాణా: డీఎస్పీ సీహెచ్‌ రాజు

  • Jan 09, 2026 18:03 IST

    దేవాదాయ, అటవీశాఖల్లో సిబ్బంది కొరత ఉంది: మంత్రి కొండా సురేఖ

    • దేవాలయాల అభివృద్ధికి త్వరలో నిధుల కేటాయింపులు: కొండా సురేఖ

    • దూపదీప నైవేద్యాలపై ఆడిట్‌ జరుగుతోంది.. త్వరలో చర్యలు: సురేఖ

    • టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్: మంత్రి కొండా సురేఖ

    • యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై త్వరలో నిర్ణయం: కొండా సురేఖ

  • Jan 09, 2026 18:03 IST

    TVK చీఫ్‌ విజయ్‌ సినిమా 'జన నాయగన్‌'కు వీడని చిక్కులు

    • 'జన నాయగన్‌' సినిమా యూనిట్‌కు డివిజన్‌ బెంచ్‌ షాక్

    • 'జన నాయగన్‌' సినిమాకు U/A సర్టిఫికెట్‌ ఇవ్వాలన్న..

    • సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే

    • తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా

  • Jan 09, 2026 18:03 IST

    చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంచలన ఆపరేషన్

    • తెలంగాణ వ్యాప్తంగా 18 బృందాలతో దాడులు

    • చైల్డ్ పోర్న్ వీడియోస్‌ షేర్, అప్‌లోడ్ చేస్తున్న 24 మంది అరెస్టు

    • అరెస్టయిన వారిలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి

    • విదేశీ చైల్డ్ పోర్న్ వీడియోలుగా గుర్తించిన CSB పోలీసులు

  • Jan 09, 2026 17:26 IST

    హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పరిధిలో విషాదం

    • 10 నెలల కుమారుడికి విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్య

    • కుమార్తె, మనవడు మృతిని తట్టుకోలేక అమ్మమ్మ ఆత్మహత్యాయత్నం

  • Jan 09, 2026 17:26 IST

    'రాజా సాబ్‌' సినిమాకు ఎదురుదెబ్బ

    • 'రాజా సాబ్‌' సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

    • టికెట్‌ రేట్ల పెంపు మెమోను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

    • పాత రేట్లకే వసూలు చేయాలని బుక్‌ మై షోకు ఆదేశం

  • Jan 09, 2026 16:04 IST

    చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం: సీఎం రేవంత్

    • హైదరాబాద్‌: నీళ్ల వివాదాలపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

    • నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దు: సీఎం రేవంత్

    • నీటి పంచాయతీ కంటే పరిష్కారానికే ఇష్టపడతా: రేవంత్

    • పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్

    • చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం: సీఎం రేవంత్

    • పక్క రాష్ట్రాలతో సయోధ్య, సహకారం ఉండాలి: రేవంత్‌

    • అమరావతి అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్‌ సహకారమూ ఉండాలి

    • రెండు రాష్ట్రాలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి: సీఎం రేవంత్

    • పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలని మాకు లేదు: సీఎం రేవంత్

    • మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకేస్తే.. మేం పది అడుగులు వేస్తాం

    • కృష్ణా నదిలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులకు..

    • సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా: సీఎం రేవంత్‌

  • Jan 09, 2026 16:03 IST

    హైదరాబాద్‌: నీళ్ల వివాదాలపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

    • నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దు: సీఎం రేవంత్

    • నీటి పంచాయతీ కంటే పరిష్కారానికే ఇష్టపడతా: రేవంత్

    • పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్

    • నీటి వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలని మాకు లేదు: రేవంత్

    • పక్క రాష్ట్రాలతో సయోధ్య ఉండాలి: సీఎం రేవంత్‌

    • అమరావతి అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్‌ సహకారమూ ఉండాలి: రేవంత్

    • రెండు రాష్ట్రాలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి: సీఎం రేవంత్

    • పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలని మాకు లేదు: సీఎం రేవంత్

    • మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకేస్తే.. మేం పది అడుగులు వేస్తాం: రేవంత్

    • కృష్ణా నదిలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులకు..

    • సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా: సీఎం రేవంత్‌

  • Jan 09, 2026 15:59 IST

    రాజమండ్రి: రాయవరంలో సీఎం చంద్రబాబు

    • మంచి, చెడుకు మధ్య తేడా ప్రజలు గుర్తించాలి: చంద్రబాబు

    • నరకాసురుడి పాలన మళ్లీ రాకూడదని కోరుకోవాలి: చంద్రబాబు

    • గోదావరి పుష్కరాలు వచ్చిన మూడుసార్లు... నేనే సీఎంగా ఉండటం నా అదృష్టం: సీఎం చంద్రబాబు

    • సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరవే ఉండదు: సీఎం

    • ఆనకట్ట కట్టి రైతులకు నీళ్లు ఇచ్చారనే కాటన్ దొరను పూజిస్తున్నాం: సీఎం

    • పోలవరం ప్రాజెక్ట్‌.. రాష్ట్రానికి జీవనాడి: సీఎం చంద్రబాబు

    • పోలవరం పూర్తయితే ఈ ప్రాంతాలకు నీటి సమస్యే ఉండదు

    • పోలవరం నుంచి విశాఖకు.. అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం

    • ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు: చంద్రబాబు

    • నదుల అనుసంధానం చేసుకుంటే నీటికి ఇబ్బందే ఉండదు: చంద్రబాబు

    • గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవు: చంద్రబాబు

    • మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు: చంద్రబాబు

  • Jan 09, 2026 15:17 IST

    రైతులకు ఎప్పుడూ అన్యాయం జరగకూడదు: సీఎం చంద్రబాబు

    • కరోనా సమయంలోనూ పనిచేసి రైతులు అందరికి అన్నం పెట్టారు

    • ఏపీలో 6,680 ఎకరాల్లో రీ సర్వే చేశాం: సీఎం చంద్రబాబు

    • 22.30 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేశాం: చంద్రబాబు

    • గతంలో పట్టాదారు పాసు పుస్తకాలకు జగన్‌ ఫొటో పెట్టుకున్నారు: సీఎం చంద్రబాబు

    • జగన్, అతని అనుచరులు మీ భూములను కాజేసేవారే: చంద్రబాబు

    • కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైట్‌లింగ్‌ యాక్ట్ రద్దు చేశాం: సీఎం

    • ఈ పట్టాదారు పాసు పుస్తకాన్ని ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు: సీఎం

    • ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే గుర్తించి శిక్షించే పరిస్థితి ఉంది: చంద్రబాబు

  • Jan 09, 2026 15:16 IST

    రాజమండ్రి: అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

    • పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై చంద్రబాబు సీరియస్‌

    • పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై...

    • కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై సీఎం చంద్రబాబు మండిపాటు

    • ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి: చంద్రబాబు

    • ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవు: చంద్రబాబు

    • పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో పారదర్శకత ఉండాలి: చంద్రబాబు

  • Jan 09, 2026 14:55 IST

    నెల్లూరు సెంట్రల్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

    • జైలులో ఖైదీలకు భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించిన మంత్రి

    • ఖైదీలతో మాటామంతి.. సమస్యలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి

    • జైలులో రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లి సోదరులు

  • Jan 09, 2026 14:55 IST

    అమరావతి: జగన్ వైఖరి, అబద్ధాల తీరును ఎండగట్టిన మంత్రి ఆనం

    • ఏపీకి రాజధాని వద్దంటున్న జగన్‌ మాత్రం...

    • నాలుగు రాజధానుల్లో ప్యాలెస్‌లు కట్టుకున్నారు: మంత్రి ఆనం

    • వెలిగొండ ప్రాజెక్ట్‌ నీరు ప్రజలకు ఎందుకు అందడం లేదో చెప్పాలి: ఆనం

    • తిరుమలలో మద్యం బాటిళ్లు పడేసి వైసీపీ నేతలు కుట్రలు చేశారు: ఆనం

  • Jan 09, 2026 14:54 IST

    అమరావతి: జగన్‌కు మంత్రి ఆనం సవాల్‌

    • మేమొస్తే.. మేమొస్తే అంటూ కామెంట్లు చేయడం కాదు..

    • 11 సీట్లకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధంకావాలని ఛాలెంజ్

    • జగన్ రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాదు: మంత్రి ఆనం

    • ప్రసాదంలో నత్తలు కలిపే రాజకీయ నత్తలు వైసీపీ నేతలు: ఆనం

    • ప్రజలను పీడించే జలగ వంటి వ్యక్తి జగన్: మంత్రి ఆనం

  • Jan 09, 2026 13:58 IST

    హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్..

    • నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేసిన హైకోర్టు..

    • గతంలో నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేసిన కోర్టు..

    • నవదీప్ డ్రగ్స్‌ను వాదించిన హై కోర్టు న్యాయవాది వెంకటసిద్ధార్థ్..

    • నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు కాబట్టి కేస్ కొట్టేస్తున్నాం: హై కోర్టు

  • Jan 09, 2026 12:32 IST

    'రాజాసాబ్' టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

    • సింగిల్ జడ్జి దగ్గర మెన్షన్ చేసిన న్యాయవాది శ్రీనివాస్

    • అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ..

    • ప్రభుత్వం మెమో ఇచ్చిందన్న న్యాయవాది శ్రీనివాస్

    • పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న హైకోర్టు

  • Jan 09, 2026 12:20 IST

    కీసర మేకరక్తం మాఫియాపై FIR నమోదు

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన GHMC డిప్యూటీ కమిషనర్ వాణి.

    • సోను మటన్ షాపులో జీవించి ఉన్న మేకల నుంచి రక్తం సేకరణ.

    • ఈనెల 4న రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు.

    • ముగ్గురిపై జీవహింస చట్టానికి సంబంధించిన సెక్షన్లతో కేసులు.

  • Jan 09, 2026 11:55 IST

    విజయ్ 'జననాయగన్' సినిమాపై డివిజన్‌ బెంచ్‌కు సెన్సార్ బోర్డు

    • సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCకి మద్రాస్ హైకోర్టు ఆదేశం

    • సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన సెన్సార్ బోర్డు

    • కేసును వెంటనే విచారించాలని సెన్సార్ బోర్డు పిటిషన్

  • Jan 09, 2026 11:51 IST

    ఢిల్లీ: హోంశాఖ కార్యాలయం ఎదుట టీఎంసీ ఎంపీల ఆందోళన

    • కోల్‌కతాలో ఈడీ దాడులకు వ్యతిరేకంగా నిరసన.

    • టీఎంసీ ఎంపీలను అరెస్ట్ చేసిన పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌కు తరలింపు.

    • నిన్న కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు.

    • ఈడీ తీరును తప్పుబట్టిన ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

  • Jan 09, 2026 11:33 IST

    లాలూ ప్రసాద్ యాదవ్‌కు బిగ్ షాక్..

    • RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో దక్కని ఊరట

    • 'ల్యాండ్ ఫర్ జాబ్స్' స్కామ్‌లో లాలూ, ఇతరులపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

  • Jan 09, 2026 10:28 IST

    ములుగు: మేడారంలో పలు శాఖల ఉద్యోగుల ఆందోళన

    • తమకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ నిరసన

    • ఆహారం కోసం గొడవ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

    • ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేష్‌పై అధికారులకు సిబ్బంది ఫిర్యాదు

  • Jan 09, 2026 10:13 IST

    ఆలయాల్లో భారీ చోరీ..

    • పల్నాడు: నరసరావుపేటలో అర్థరాత్రి రెండు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు.

    • శ్రీరాంపురంలో ఉన్న బ్రహ్మంగారి గుడి, రాముల వారి గుడిలోకి చొరబడిన దొంగలు.

    • గేటు తాళాలను పగలకొట్టి రెండు హుండీల్లో ఉన్న నగదు చోరీ.

    • దేవాలయాల్లో చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ధర్మకర్త.

  • Jan 09, 2026 09:37 IST

    కోనసీమ: ఇరుసుమండలో కొనసాగుతోన్న బ్లోఅవుట్

    • మంటల తీవ్రత తగ్గినా పూర్తి నియంత్రణకు ONGC చర్యలు

    • గూడపల్లి నుంచి నీటిని వినియోగించుకుని మంటలార్పుతున్న సిబ్బంది

    • బ్లోఅవుట్‌తో 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్టు అంచనా

  • Jan 09, 2026 08:53 IST

    రంగారెడ్డి: పెద్ద అంబర్‌పేటలో సినిమా షూటింగ్‌కు వెళ్తున్న బస్సు బోల్తా.

  • Jan 09, 2026 07:17 IST

    నేడు లైట్‌హౌస్‌ ఫెస్టివల్‌..

    • తిరుమల: నేడు విశాఖ వేదికగా లైట్‌హౌస్‌ ఫెస్టివల్‌..

    • విశాఖ MGM పార్క్ వేదికగా లైట్‌హౌస్‌ ఫెస్టివల్‌..

    • ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి సురేష్‌ గోపి .

  • Jan 09, 2026 07:01 IST

    నేడు పిఠాపురంలో పవన్ పర్యటన..

    • నేడు పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన..

    • సంక్రాంతి వేడుకలకు హాజరుకానున్న పవన్ కల్యాణ్..

    • 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్.

  • Jan 09, 2026 06:02 IST

    నేడు రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

    • తూ.గో.: నేడు రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటన..

    • వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడనున్న చంద్రబాబు..

    • రాయవరంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ..

    • మధ్యాహ్నం12:05కు రాయవరంలో ప్రజా వేదిక సభకు హాజరు..

    • మధ్యాహ్నం 2:05కు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్ష.